శత్రుదేశాల వెన్నులో వణుకుపుట్టించే విషయం.. భారత అమ్ముల పొదిలో మరో సరికొత్త ఆయుధం చేరింది. గగనతల రక్షణ వ్యవస్థను మరింత సమర్థవంతం చేయడానికి 400 Missile Defence System ను రష్యా నుంచి దిగుమతి చేసుకుంది.
సరిహద్దు దేశాలను ముప్పు పొంచి ఉన్న వేళ భారత అమ్ముల పొదిలో సరికొత్త ఆయుధం చేరింది. గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికిS 400 Missile Defence System ను రష్యా నుంచి దిగుమతి చేసుకుంది భారత్ ఎయిర్ ఫోర్స్. ఎస్ 400 ట్యాంకులను పంజాబ్ సెక్టార్లో మోహరించింది. ఎస్–400 ట్యాంకర్లు సుదూర లక్ష్యాలను ఛేదించడంలో, గగనతలం నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోవడంలో భారత్ కు అండగా నిలువనున్నాయి. ఈ ట్యాంకర్ల విషయంలో మూడేళ్ల క్రితమే రష్యా- భారత్ మధ్య ఒప్పందం జరిగింది.
ఈ ఒప్పందంలో భాగంగా.. తొలి విడత ఎస్ 400 ట్యాంకులు ఇండియాకు చేరుకున్నాయి. పాక్ , చైనాల నుంచి ఉగ్ర ముప్పు ఉందని అమెరికా చెప్పడంతో ఎస్ 400 ట్రయాంఫ్ ట్యాంకర్లను పంజాబ్ సెక్టార్‌లో మోహరిస్తున్నారు. శత్రు దేశాల నుంచి వాటిల్లే ఎలాంటి ముప్పునైనా.. ఈ క్షిపణులు సమర్థవంతంగా ఎదుర్కొంటాయి.
స్క్వాడ్రన్ల ఎస్-400 కొనుగోలు కోసం భారత్ దాదాపు రూ.35 వేల కోట్ల రూపాయలు వెచ్చించింది. ఈ మేరకు గత మూడేండ్ల కిత్రమే రష్యాతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా.. ఐదు స్క్వాడ్రన్ల ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను భారత్ కు పంపేలా ఒప్పందం జరిగింది. ఈ క్రమంలో అమెరికా ఆంక్షాలు విధించింది. అయినా ఏ మాత్రం వెనుకడగు వేయకుండా.. భారత్ రష్యాతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే ఈ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ వినియోగంపై రష్యాలో ఎయిర్ ఫోర్స్ అధికారులకు శిక్షణ నిచ్చింది.
Read Also: వెంకయ్యనాయుడు సస్పెండ్ చేసిన ఎంపీలు.. ఆయన నిర్వహించిన వేడుకకు హాజరు
ఎస్-400 ప్రత్యేకతలేంటీ...
నాటో దేశాల వైమానిక దాడులను సమర్థవంతంగా ఎదుర్కొవడానికి రష్యా ఎస్-400 ట్రయంఫ్ లను వాడుతోంది. విభిన్నమైన రాడార్లు, క్షిపణుల సమన్వయంతో పనిచేసి ప్రత్యర్థుల ఫైటర్ జెట్స్, రాకెట్లు, మానవ రహిత విమానాలను కూల్చేసే ఒక వ్యవస్థ ఇది. దీంతో ఏక కాలంలో ఎనిమిది క్షిపణులను ప్రయోగించవచ్చు.
అలాగే.. 'బిగ్‌బర్డ్' బ్యాటిల్ అక్విజేషన్ అండ్ ఎంగేజ్‌మెంట్ సిస్టమ్ ఎస్ 400లో ఉంది. దీంతో దాదాపు 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గుర్తించగలదు. ఈ ట్యాంకర్ల రక్షణకు 'ఎలక్ట్రానిక్ కౌంటర్ కౌంటర్ మెజర్స్' (ఈసీసీఎం) సూట్ ఉంటుంది. దీంతో ఎలక్ట్రానిక్ వార్ఫేర్, జామింగ్‌లను సమర్థవంతంగా ఎదుర్కొగలదు.
అలాగే.. ఎస్ 400లో 'గ్రేవ్‌స్టోన్' ఎంగేజ్‌మెంట్ అండ్ ఫైర్ కంట్రోల్ రాడార్ ఉంటుంది. ఇది దాడాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సమర్థవంతంగా చేధించగలదు. ఎస్-400 వ్యవస్థలో ఏకకాలంలో 100 లక్ష్యాలను టార్గెట్ చేయగల సామర్థ్యం దీని సొంతం. ఇందులో ఆల్-ఆల్టిట్యూడ్ అక్విజేషన్ రాడార్
వ్యవస్థ ఉంది. దీంతో ఆప్షనల్ 3డీ ఎర్లీ వార్నింగ్ అండ్ అక్విజేషన్ కూడా చేయవచ్చు.
Read Also: ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధాన బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. అసలు బిల్లులో ఏముందంటే..
రష్యా ఎస్-400 వ్యవస్థను 2007లో సైన్యంలో ప్రవేశపెట్టింది. నాటో దేశాల నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేందుకు మల్టీసిస్టం ఆయుధాలుగా చెప్పవచ్చు. ఆ ఏడాదే.. సెకన్‌కు 2,800 మీటర్ల వేగంతో వస్తున్న రెండు లక్ష్యాలను 16 కిలోమీటర్ల ఎత్తున ఎస్-400 ఛేదించినట్లు రష్యా పేర్కొంది. ప్రస్తుతం ఈ తరహా ట్యాంకర్లు రష్యా, చైనా, టర్కీ దేశాల వద్ద మాత్రమే ఉన్నాయి. తాజా జాబితాలోకి భారత్ కుడా చేరడం హర్షనీయం.
Read Also: ఇండియాకు వ్యతిరేకంగా విష ప్రచారం.. పాక్ స్పాన్సర్డ్ యూట్యూబ్ ఛానెల్స్‌పై భారత్ కొరడా
పంజాబ్ సెక్టార్‌లో ఎందుకు పెట్టారనే ప్రశ్న అందరిలో ఉదయిస్తోంది. ఎస్-400 వ్యవస్థలోని రాడార్లు 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సమర్థవంతంగా చేధించగలదు. అలాగే.. భారత్ కు ఉగ్రముప్పు ఉందని అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో వాస్తవాధీన రేఖ, కశ్మీర్, నియంత్రణ రేఖ దీని పరిధిలోకి వచ్చేలా పంజాబ్ సెక్టార్‌లో మోహరిస్తున్నారు. తత్ఫలితంగా.. ఇరు దేశాల సరిహద్దుల్లో టార్టెట్ ఫిక్స్ చేయవచ్చు.ఈ క్షిపణి వ్యవస్థను వాహనాలపై ఇతర ప్రాంతాలకు తరలించే వీలుంది. అందుకే ఈ వార్త తెలుసుకున్న శత్రు దేశాల వెన్నులో వణుకు పుడుతోంది.
