2047 నాటికి భారత్ 20 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుంది - బిబేక్ డెబ్రాయ్
2047 నాటికి భారతదేశ జీడీపీ 20 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని పీఎం ఎకనామిక అడ్వెజరీ కౌన్సిల్ చైర్మన్ బిబేక్ డెబ్రాయ్ అన్నారు. అలాగే తలసరి ఆదాయం 10,000 డాలర్లకు చేరుకుంటుందని చెప్పారు.

2047 నాటికి భారతదేశ జీడీపీ 20 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ బిబెక్ దేబ్రాయ్ అన్నారు. ఆ సమయం నాటికి భారతదేశం రూపాంతరం చెందిన సమాజంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే తలసరి ఆదాయం 10,000 డాలర్లకు (ప్రస్తుత విలువలో) చేరుకుంటుందని అన్నారు.
బిర్యానీని టిఫిన్స్ జాబితాలో చేర్చిన సాఫ్ట్‌వేర్.. హైదరాబాదీ అంటూ సత్య నాదెళ్ల రియాక్షన్ ఇదే..
‘‘2047లో భారతదేశం తలసరి ఆదాయం నేటి 10,000 డాలర్ల విలువను కలిగి ఉంటుంది. జీడీపీ సగటు పరిమాణం కూడా 20 ట్రిలియన డాలర్లకు చేరుకుంటుంది. అందువల్ల భారతదేశం ఒక రూపాంతరం చెందిన సమాజంగా మారుతుంది’’ అని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH)లో జరిగిన ఇండియన్ ఎకనామెట్రిక్ సొసైటీ 57వ వార్షిక సదస్సులో ప్రారంభ సెషన్‌లో వర్చువల్ గా డెబ్రాయ్ అన్నారు.
బెంగాల్ లో మరో నలుగురికి కోవిడ్ కొత్త వేరియంట్ బీఎఫ్7
అయితే కోవిడ్ మహమ్మారి దాటిపోయినప్పటికీ, చైనాలో ప్రస్తుత పరిస్థితి, రష్యా-ఉక్రెయిన్ వివాదం, యూరోప్, యూఎస్ఎలో వృద్ధి అవకాశాలపై ప్రపంచ వ్యాప్తంగా ఇంకా చాలా అనిశ్చితి ఉందని బిబేక్ డెబ్రాయ్ తెలిపారు.
ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు ప్రభుత్వం ప్రాథమిక అవసరాలను అందించిందని తెలిపారు. కోవిడ్ తర్వాత ఆర్థిక సూచికలు భారతదేశంలో మెరుగుపడ్డాయని ఆయన అన్నారు. అందరూ ఇప్పుడు 2023-24లో వృద్ధి రేటును, 2047 నాటికి ఆర్థిక వృద్ధిని చూడాలని తెలిపారు.వివిధ రాష్ట్రాలు వివిధ స్థాయిలలో అభివృద్ధి చెందుతున్నందున రాష్ట్రాల స్థాయిలో భారతదేశ వృద్ధి రేటును 7 శాతం నుండి 8 శాతానికి పెంచడానికి అధిక పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని, అందువల్ల వృద్ధి వనరులు కూడా భిన్నంగా ఉంటాయని దేబ్రాయ్ అన్నారు.
యోగి ఆదిత్యనాథ్ కాషాయ బట్టలు ధరించడం మానేయాలి - కాంగ్రెస్ నేత హుస్సేన్ దల్వార్.. మండిపడ్డ బీజేపీ
భారతదేశానికి సరళీకృత జీఎస్టీ, ప్రత్యక్ష పన్ను అవసరమని బిబేక్ డెబ్రాయ్ తెలిపారు. ఎందుకంటే ఇవి ప్రతీ ఒక్కరూ ఆలోచించాల్సిన రంగాలు, విధాన నిర్ణయాలను మరింత సమాచారంతో చేయడానికి సహాయపడే పరిశోధనలు ఇవి అని అన్నారు.