Asianet News TeluguAsianet News Telugu

బెంగాల్ లో మరో నలుగురికి కోవిడ్ కొత్త వేరియంట్ బీఎఫ్7

ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్7 కోల్ కతాలో నాలుగు కేసులు బయటపడడంతో భయాందోళనలు నెలకొన్నాయి. 

Chinese variant BF7 for four people in West Bengal
Author
First Published Jan 5, 2023, 12:21 PM IST

కోత్ కతా : ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 విజృంభిస్తోంది. దీనివల్ల చైనా, అమెరికా సహా పలుదేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. బీఎఫ్.7 వేరియంట్ కేసులు ఇప్పటికే భారత్ లో కూడా అక్కడక్కడా నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పశ్చిమ బెంగాల్ లో ఈ వేరియంట్ కలకలం సృష్టించింది. బెంగాల్ లో నలుగురికి కోవిడ్ వేరియంట్  బీఎఫ్.7 సోకినట్లు నిర్థారణ అయ్యింది. 

అమెరికా నుంచి ఇటీవలే భారత్ కు వచ్చిన నలుగురిలో ఈ వేరియంట్ ఉన్నట్లు తేలింది. విదేశాలనుంచి వచ్చిన వారికి చేసిన టెస్టుల్లో భాగంగా వీరి నమూనాలు జీనోమ్ సీక్వేన్వింగ్ కు పంపించారు. ఈ పరీక్షల్లో బీఎఫ్.7 వేరియంట్ వీరికి సోకినట్లు తేలింది. ఈ మేరకు అధికారులు సమాచారం వెల్లడించారు. ప్రస్తుతం వీరిని ఐసోలేషన్ లో ఉంచి, చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఆరోగ్యం నిలకడగానే ఉంది. అని అధికారులు తెలిపారు.  

కోవిడ్ కొత్త వేరియంట్ బీఎఫ్7 సోకిన నలుగురిలో ముగ్గురు బెంగాల్ లోని నదియా జిల్లాకు చెందినవారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించామన్నారు. నాలుగో వ్యక్తి బిహార్ నుంచి వచ్చి కోల్ కతాలో ఉంటున్నాడని అన్నారు. వైరస్ వ్యాప్తిని అరిగట్టడానికి వీరితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించే క్రమంలో 33మందిని గుర్తించినట్లు తెలిపారు. 

యువకులకు వధువులను ఇవ్వడం లేదు.. సామాజిక సమస్యలను సృష్టిస్తున్న బీజేపీ ప్రభుత్వాలు : శ‌ర‌ద్ ప‌వార్

ఈ నలుగురితో  33 మంది సన్నిహితంగా మెలిగారన్నారు. వారందరికీ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ వీరిని నిశితంగా పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. చైనాలో కోవిడ్ కొత్త వేరియంట్ వెలుగులోకి రావడంతో నిరుడు డిసెంబర్ నుంచి విదేశాలనుంచి వచ్చేవారికి  కోల్ కతా విమానాశ్రయంలో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

పాజిటివ్ గా తేలిన వారి నుంచి నమూనాలను సేకరిస్తున్నారు. జీనోమ్ సీక్వేన్వింగ్ కు పంపించి వేరియంట్ తేల్చి,, పరీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే గత వారం కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో ఓ విదేశీయుడికి, మరో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్  వచ్చింది. దీంతో వీరి నమూనాలు జీనోమ్స్ సీక్వెన్సింగ్ కు పంపించగా, పరీక్షల్లో వారికి కూడా బీఎఫ్7 సోకినట్లు తేలింది.  

Follow Us:
Download App:
  • android
  • ios