Nitin Gadkari: రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య పరంగా భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య పరంగా భారతదేశం నంబర్ 1 స్థానంలో ఉందనీ, గాయపడిన వ్యక్తుల సంఖ్యలో 3వ స్థానంలో ఉందని చెప్పారు. 

road accidents: దేశంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య విషయంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య పరంగా భారతదేశం నంబర్ 1 స్థానంలో ఉండగా, గాయపడిన వ్యక్తుల సంఖ్య విషయంలో 3వ స్థానంలో ఉందని చెప్పారు. జెనీవాలోని ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ విడుదల చేసిన వరల్డ్ రోడ్ స్టాటిస్టిక్స్ (డబ్ల్యూఆర్‌ఎస్) 2018 తాజా సంచిక ఆధారంగా భారత్ ప్రమాదాల్లో 3వ స్థానంలో ఉందని రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో నితిన్ గడ్కరీ తెలిపారు.

రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్యలో భారతదేశం నంబర్ 1 స్థానంలో ఉంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వ్యక్తుల సంఖ్యలో 3వ స్థానంలో ఉందని గడ్కరీ వెల్లడించారు. అంతేకాకుండా, 2020 సంవత్సరానికి 18 నుండి 45 సంవత్సరాల మధ్య రోడ్డు ప్రమాదాల్లో మరణాల శాతం 69.80 శాతంగా ఉందని పార్లమెంటుకు తెలియజేసింది. ఒక ప్రత్యేక ప్రశ్నకు సమాధానమిస్తూ, మొత్తం 22 గ్రీన్‌ఫీల్డ్ హైవేలు (రూ. 1,63,350 కోట్లతో 2,485 కి.మీ పొడవుతో కూడిన 5 ఎక్స్‌ప్రెస్‌వేలు మరియు రూ. 5,816 కి.మీ పొడవుతో కూడిన 17 యాక్సెస్-నియంత్రిత హైవేలు రూ. 1,92,876 కోట్లు) అభివృద్ధికి ఉద్దేశించబడింది.

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేలోని మూడు విభాగాలు అంటే ఢిల్లీ “దౌసా – లాల్సోట్ (జైపూర్) (214 కి.మీ), వడోదర “అంక్లేశ్వర్ (100 కి.మీ) మరియు కోటా” రత్లాం ఝబువా (245 కి.మీ) మార్చి 23 నాటికి పూర్తి చేయడానికి ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. వాహనం రిజిస్ట్రేషన్ నంబర్/ఛాసిస్ నంబర్ ఆధారంగా వాహన వినియోగదారులకు ఫాస్ట్‌ట్యాగ్ జారీ చేయబడుతుందని మంత్రి చెప్పారు. మార్చి 30, 2022 నాటికి, వివిధ బ్యాంకులు జారీ చేసిన మొత్తం ఫాస్ట్‌ట్యాగ్‌ల సంఖ్య 4,95,20,949 మరియు జాతీయ రహదారులపై ఉన్న ఫీజు ప్లాజాల వద్ద ఫాస్ట్‌ట్యాగ్ వ్యాప్తి దాదాపు 96.5 శాతంగా ఉందని గడ్కరీ చెప్పారు.

ఇదిలావుండగా, అంతకు ముందు రోజు నితిన్ గడ్కరీ.. కాశ్మీర్ ఫైల్స్ సినిమా పై ప్రశంసలు కురిపించారు. 'ది కాశ్మీర్ ఫైల్స్ అనే చిత్రం కాశ్మీరీయుల‌ నిజమైన చరిత్రను బయటకు తెచ్చిందని, ఈ చిత్రం చిరకాలం గుర్తుండిపోతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మంగ‌ళ‌వారం The Kashmir Files చిత్రంలో న‌టించిన నటులు అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిలను ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గ‌డ్క‌రీ పాల్గొని త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత శ్యామ్ జాజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గడ్కరీ మాట్లాడుతూ.. కాశ్మీరీ పండిట్ల గొప్ప చరిత్ర ఉందని, కాశ్మీరీ పండిట్లను వేధించడం, బలవంతంగా (లోయ నుండి) తరలించడం వంటి వాస్త‌విక విషయాల‌ను ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రి కండ్ల‌కు క‌ట్టిన‌ట్టు చిత్రీక‌రించార‌ని, చరిత్రను పునఃసమీక్షించార‌ని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.