2027-28 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ - నిర్మలా సీతారామన్
2047 నాటికి భారత్ (India) కనీసం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (union finance minister nirmala sitharaman) అన్నారు. 2023 వరకు 23 ఏళ్లలో భారతదేశానికి 919 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే అందులో ప్రధాని మోడీ హయాంలోనే 65 శాతం వచ్చాయని వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024 (Vibrant Gujarat Global Summit 2024) లో చెప్పారు.
2027-28 నాటికి భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. ఆ సమయం నాటికి భారత్ జీడీపీ 5 ట్రిలియన్ డాలర్లను దాటుతుందని తెలిపారు. బుధవారం వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ -2024 లో పాల్గొని మాట్లాడారు.
రాముడి ఉనికినే కాంగ్రెస్ ఖండించింది.. ఆలయం వద్దని కోర్టుకు వెళ్లింది - బీజేపీ
2047 నాటికి భారత్ కనీసం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా వేస్తున్నామని సీతారామన్ అన్నారు. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే కాకుండా సమ్మిళిత వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె వివరించారు.
దీర్ఘకాలికంగా సమ్మిళిత వృద్ధిని పెంపొందించాలనే నిబద్ధతతో ఆర్థిక మైలురాళ్లను సాధించడం కంటే దేశ లక్ష్యం విస్తరించి ఉందని ఆమె ఉద్ఘాటించారు.
కొండగట్టు ఆలయ హుండీ లెక్కింపులో దొంగతనం..
2023 వరకు 23 ఏళ్లలో భారతదేశానికి 919 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రి అన్నారు. అయితే ఇందులో 65 శాతం అంటే 595 బిలియన్ డాలర్లు నరేంద్ర మోడీ ప్రభుత్వ గత 8-9 సంవత్సరాలలో వచ్చాయని చెప్పారు. 2014 నుంచి రాష్ట్రాలు, కేంద్రం మధ్య సహకార ఫెడరలిజం, కాంపిటీటివ్ ఫెడరలిజం, కోఆపరేటివ్ ఫెడరలిజం అనే విధానం ఉందన్నారు. అందుకే 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి ఎవరు ఎంత సహకారం అందిస్తారనే విషయంలో రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయని ఆమె అన్నారు.
కాగా.. భారత జీడీపీ ప్రస్తుతం 3.4 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7.6 శాతంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచింది.