మణిపూర్‌లో అల్లర్లు, ప్రస్తుత పరిస్ధితులపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. దేశం యావత్తు మణిపూర్ వెంటే వుంటుందని, త్వరలోనే అక్కడ శాంతిని పునరుద్దరిస్తామని ప్రధాని తెలిపారు. మణిపూర్‌లో ప్రజాస్వామ్యం హత్య జరిగిందంటారని.. వాళ్ల మనసులో ఏదుంటే అదే కనిపిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. 

మణిపూర్‌లో అల్లర్లు, ప్రస్తుత పరిస్ధితులపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మోడీ లోక్‌సభలో ప్రసంగించారు. దేశం యావత్తు మణిపూర్ వెంటే వుంటుందని, త్వరలోనే అక్కడ శాంతిని పునరుద్దరిస్తామని ప్రధాని తెలిపారు. హైకోర్టు తీర్పు తర్వాత మణిపూర్‌లో పరిస్థితి మారిందన్నారు. హైకోర్టు తీర్పులో రెండు కోణాలున్నాయని.. త్వరలో మణిపూర్ ప్రగతి పథంలో పయనిస్తుందని మోడీ ఆకాంక్షించారు. మణిపూర్‌లో ప్రజాస్వామ్యం హత్య జరిగిందంటారని.. వాళ్ల మనసులో ఏదుంటే అదే కనిపిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. 

భారత మాతను ముక్కలు చేసింది వీళ్లేనని.. వందేమాతరం గీతాన్ని కూడా ముక్కలు చేసింది వీళ్లేనని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతమాత చావును ఎందుకు కోరుకుంటున్నారో అర్ధం కావడం లేదని.. భారతమాతను కాపాడాల్సిన వాళ్లే భుజాలు నరికేశారని మోడీ వ్యాఖ్యానించారు. తుక్‌డే గ్యాంగ్‌ను ప్రోత్సహిస్తున్నారని.. 1966లో మిజోరం ఘటనకు కారణం ఎవరని ఆయన ప్రశ్నించారు. మిజోరంలోని సామాన్యులపై దాడులు చేయించారని.. మిజోరంలోని ప్రజలపై బాంబులు వేసేందుకు ఎయిర్‌ఫోర్స్‌ను ఉపయోగించారని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. 

ALso Read: అవిశ్వాసం మాకు అదృష్టం.. 2018లోనూ ఇంతే, 2019లో ఏమైంది : విపక్షాలకు మోడీ కౌంటర్

మిజోరం గాయాన్ని మాన్పేందుకు కాంగ్రెస్ ప్రయత్నించలేదని.. కాంగ్రెస్‌ మిజోరం వాస్తవాన్ని ప్రజల ముందు దాచిందని మోడీ ఆరోపించారు. నెహ్రూపై లోహియా తీవ్ర ఆరోపణలు చేశారని.. ఈశాన్య భారతాన్ని చీకట్లో వుంచేశారని లోహియా చెప్పారని ప్రధాని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల గురించి వీళ్లా మాకు చెప్పేదని ఆయన ప్రశ్నించారు. ఈశాన్య భారతంలో 50 సార్లు పర్యటించానని మోడీ తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగిందని ప్రధాని తెలిపారు. 

తమ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి తొలి ప్రాధాన్యం ఇచ్చిందని మోడీ తెలిపారు. మణిపూర్‌లో సాయంత్రం 4 గంటల తర్వాత గుళ్లు, మసీదులు మూసేసేవారని.. ఈ పాపం కాంగ్రెస్‌ది కాదా అని ప్రధాని ప్రశ్నించారు. మణిపూర్ అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం కృషి చేసిందని మోడీ తెలిపారు. మణిపూర్, మిజోరం , నాగాలాండ్‌లో అభివృద్ధిని కాంగ్రెస్ చూడలేకపోతోందని ఆయన చురకలంటించారు. ప్రపంచానికి ఈశ్యాన రాష్ట్రాలను దిక్సూచిలా చేస్తామని మోడీ తెలిపారు.