Asianet News TeluguAsianet News Telugu

చైనాను నమ్మొద్దు.. అలీన విధానాన్ని వదిలేయాలి.. భారత యువత ఏం ఆలోచిస్తున్నదంటే..!

డ్రాగన్ కంట్రీని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు.. అమెరికా, చైనాల మధ్య ఘర్షణలు పెరిగితే భారత తన అలీన విధానాన్ని వదిలిపెట్టాలని భారత యువత భావిస్తున్నది. మన దేశ విదేశీ విధానాలపై నిర్వహించిన ఓ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చైనా, పాకిస్తాన్‌తో నేడు భారత్ అనుసరిస్తున్న విధానాలపై సానుకూలంగా యువత స్పందించింది. క్వాడ్ వంటి కూటమిలో చేరడాన్ని స్వాగతించారు.
 

india should abandon non alignment says youth
Author
New Delhi, First Published Nov 11, 2021, 5:00 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: భారత విదేశాంగ విధానంలో అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. ప్రపంచ దేశాలతో India నూతన విధానాలు.. అంతర్జాతీయంగా భారత్ వేస్తున్న ప్రభావాలు గణనీయంగా మారాయి. పొరుగు దేశాలతోనూ భారత్ వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, భారత విదేశాంగ విధానం(Foreign Policy)పై మన దేశ యువత అభిప్రాయాలు చాలా వరకే ఒకే గాటన కనిపిస్తున్నాయి. విదేశాంగ విధానం, విదేశీ పరమైన అంశాలపై భారత యువత ఎలా ఆలోచిస్తున్నదని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఓ సర్వే చేపట్టింది. 14 నగరాల్లోని 2.37 మంది యువత అంటే 18 నుంచి 35ఏళ్ల వయసున్న వారి నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఈ Survey ప్రకారం యువత ఆలోచన ధోరణిలోనూ అనూహ్య మార్పులు వచ్చినట్టు అర్థమవుతున్నది.

Chinaను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దనేది మెజార్టీ యువత అభిప్రాయంగా ఈ సర్వే వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న 77 శాతం మంది యువత చైనాను నమ్మవద్దని భావిస్తున్నారు. అలాగే, చైనా, Americaల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంటే భారత్ కచ్చితంగా అలీన విధానానికి(Non Alignment) స్వస్తి పలకాలని 62శాతం మంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న విదేశాంగ విధానాలపై 72శాతం మంది సంతుష్టిగా ఉన్నారు. ఈ అభిప్రాయం ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న విదేశాంగ విధానాలకు ఆమోదం లభించినట్టుగా చూస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్, చైనాలతో వ్యవహరిస్తున్న తీరు.. అలాగే, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కలిసి క్వాడ్(Quad) కూటమిలో చేరడంపైనా భారత యువత సంతృప్తిగా ఉన్నట్టు అర్థమవుతున్నది. అంతేకాదు, చైనా మొబైల్ అప్లికేషన్లను నిషేధించడం, బాలాకోట్‌లో మెరుపు దాడులు నిర్వహించడం, దేశంలోకి అక్రమ వలసలను నియంత్రించే విధానాలకు యువత మద్దతు ఉన్నట్టు ఈ సర్వే వెల్లడిస్తున్నది.

Also Read: ప్రపంచంలోనే హై పాపులారిటీ లీడర్.. ప్రధాని నరేంద్ర మోడీ.. వెల్లడించిన అమెరికన్ సర్వే

వీటితోపాటు మరికొన్ని విషయాలనూ ఈ సర్వే తెలుపుతున్నది. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (బిమ్‌స్టెక్), షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌లపై యువతకు అవగాహన లేమి ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. 

మరో ముఖ్యవిషయం ఏమిటంటే.. ఈ సర్వేలో పాల్గొన్న 62శాతం మంది యువత ఒకవేళ చైనా, యూఎస్‌ల మధ్య ఘర్షణలు పెరిగితే మన దేశం తప్పకుండా అలీన విధానాన్ని విడిచిపెట్టాలనే అభిప్రాయాన్ని వెల్లడించారు. అంతేకాదు, కనీసం మూడింట్ రెండు వంతుల మంది అసలు అలీన విధానం గురించి వినడానికే ఇష్టపడలేకపోవడం గమనార్హం. భారత వ్యవహారాల్లో చైనా జోక్యం.. మిలిటరీ, ఆర్థిక విషయాల్లో చైనా పైచేయిగా ఉండటంపైనా ఆందోళన వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, సోవియట్ యూనియన్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ రెండు అగ్రరాజ్యాల వ్యవహారాల్లోకి వెళ్లకుండా జవహర్‌లాల్ నెహ్రూ సారథ్యంలోని భారత ప్రభుత్వం అలీన విధానాన్ని అనుసరించిన సంగతి తెలిసిందే. అప్పట్లో దానికి విశేష ఆదరణ లభించింది. రెండు దేశాలకు సరైన దూరాన్ని, దగ్గరకు పాటించిందని విశ్లేషించేవారు.

Also Read: అరుణాచల్​ప్రదేశ్​లో చైనా గ్రామం.. క్లారిటీ ఇచ్చిన భద్రత అధికారులు..

నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న ఆత్మ నిర్భర్ భారత్ మిషన్ దేశానికి కచ్చితంగా సత్ఫలితాలు చేకూరుస్తుందని 71శాతం మంది యువత భావించినట్టు సర్వే తెలిపింది. అదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ, భారతీయుల జీవన ప్రమాణాలు, విదేశీ ప్రయాణాలు, సమాజం, సంస్కృతి, విదేశాల్లో విద్య అవకాశాలపై ప్రపంచీకరణ ప్రభావంపై యువతలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమైనట్టు వివరించింది. చాలా మంది యువత విదేశీ విద్యపై సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కానీ, అక్కడే పని చేసే లక్ష్యంతో విదేశాలకు వెళ్లడంపై ఎక్కువ మంది ఆశాజనకంగా స్పందించలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios