సముద్రయాన్ కు ముమ్మరంగా ఏర్పాట్లు: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

వచ్చే ఏడాది నాటికి సముద్రయాన్ ను నిర్వహించనున్నట్టుగా  కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.
 

India' s Samudrayaan set to explore ocean bed by 2025 end Kiren Rijiju lns

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది చివరి నాటికి సముద్రయాన్ ను చేపట్టనున్నట్టుగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. సముద్రాన్ని అధ్యయనం చేయడానికి భారతదేశం తన శాస్త్రవేత్తలను పంపనుందని  కిరణ్ రిజిజు ప్రకటించారు.

ఈ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించినట్టుగా  ఆయన చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి శాస్త్రవేత్తలు నీటి పరీక్షను నిర్వహిస్తారన్నారు.2025 చివరి నాటికి సముద్రంలో 6వేల మీటర్ల లోతులో పరిశోధనలు చేసేందుకు శాస్త్రవేత్తలను పంపుతామని కేంద్ర మంత్రి రిజిజు విశ్వాసం వ్యక్తం చేశారు.

also read:మానవత్వం చాటుకున్న మంత్రి జూపల్లి: ఫిట్స్ వచ్చిన వ్యక్తి ఆసుపత్రికి తరలింపు

2021లో సముద్రయాన్ మిషన్ ప్రారంభించారు. ఇందు కోసం  మత్స్య అనే జలాంతర్గామిని సిద్దం చేస్తున్నారు.  ఈ జలాంతర్గామి ద్వారా  ముగ్గురు శాస్త్రవేత్తలను సముద్రంలోకి పంపనున్నారు.ఈ జలాంతర్గామిలో  ఆధునిక సెన్సర్లు, టూల్స్ ఉంటాయి.  ఇవి 12 గంటల పాటు పనిచేస్తాయి.  అత్యవసర సమయాల్లో ఇవి  96 గంటల పాటు పనిచేయనున్నాయి.

also read:ఎక్కడ ఏ పార్టీ పోటీ చేయాలో రెండు రోజుల్లో స్పష్టత: పొత్తులపై పురంధేశ్వరి

 అంతరిక్ష రంగంలో భారత్  ప్రపంచ దేశాల్లోని అగ్ర దేశాల సరసన నిలుస్తుంది. చంద్రయాన్  ప్రయోగం విజయవంతమైంది.  మరో వైపు  అంతరిక్షంలోకి నలుగురు వ్యోమగాములను పంపేందుకు  భారత్ పంపనుంది.ఈ మేరకు  నలుగురిని ఎంపిక చేశారు. 

also read:ముహుర్తం ఫిక్స్: వైఎస్ఆర్‌సీపీలోకి ముద్రగడ పద్మనాభం

ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన ఉపగ్రహలను  భారత్ ప్రయోగిస్తుంది. చంద్రయాన్  ప్రయోగంలో రష్యా విఫలమైంది. కానీ, ఈ ప్రయోగంలో భారత్ విజయం సాధించింది.  చంద్రయాన్ ప్రయోగం సక్సెస్ తో   ప్రపంచంలోని పలు దేశాలు  అంతరిక్షరంగంలో భారత్ వైపు చూస్తున్నారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.  అంతరిక్షంలో ప్రయోగాలతో పాటు సముద్రంలో కూడ ప్రయోగాలను చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలోనే  సముద్రయాన్  కోసం ఏర్పాట్లు చేస్తుంది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios