మానవత్వం చాటుకున్న మంత్రి జూపల్లి: ఫిట్స్ వచ్చిన వ్యక్తి ఆసుపత్రికి తరలింపు


ఫిట్స్ తో రోడ్డుపై పడిన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించాడు మంత్రి జూపల్లి కృష్ణారావు.

Minister Jupally Krishna Rao shifted illness man on Road in Ranga Reddy District lns

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు  మానవత్వాన్ని చాటుకున్నారు.  అనారోగ్య పరిస్థితులతో  రోడ్డుపై పడి ఉన్న వ్యక్తిని గమనించి  అంబులెన్స్ కు ఫోన్ చేసి  బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.

also read:ఎక్కడ ఏ పార్టీ పోటీ చేయాలో రెండు రోజుల్లో స్పష్టత: పొత్తులపై పురంధేశ్వరి

 

హైద్రాబాద్ నుండి కొల్లాపూర్ కు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం నాడు వెళ్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కు సమీపంలోని రాయికల్ టోల్ గేట్ వద్ద ఫిట్స్ వచ్చి  రోడ్డుపై ఓ వ్యక్తి పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన మంత్రి జూపల్లి కృష్ణారావు తన కాన్వాయ్ నిలిపాడు.తన అనుచరులతో బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.

also read:ముహుర్తం ఫిక్స్: వైఎస్ఆర్‌సీపీలోకి ముద్రగడ పద్మనాభం

రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు రోడ్డుపై ప్రమాదానికి గురైనవారిని, లేదా అనారోగ్యానికి గురైన వారిని గుర్తించి వారిని ఆసుపత్రికి తరలించిన ఘటనలు గతంలో కూడ చోటు చేసుకున్నాయి.  ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి సేవ చేసి వారి మన్ననలు పొందుతున్నారు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత కొందరు  ప్రజలకు దూరమౌతారు. మరికొందరు మాత్రం ప్రజలకు సేవ చేయడంలో ముందుండి పలువురి అభినందనలు పొందుతున్నారు.

also read:రోబో ద్వారా భోజనం సరఫరా: సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

జూపల్లి కృష్ణారావు  ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొల్లాపూర్ నుండి పోటీ చేసి విజయం సాధించారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో జూపల్లి కృష్ణారావుకు  చోటు దక్కింది.  2014 లో కేసీఆర్ మంత్రివర్గంలో కూడ  జూపల్లి కృష్ణారావు బెర్త్ దక్కింది. 

also read:టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు: పదేళ్ల తర్వాత మూడు పార్టీల మధ్య పొత్తు పొడుపు

2018 ఎన్నికల్లో కొల్లాపూర్  నుండి జూపల్లి కృష్ణారావు ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత పరిణామాలతో  జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్నారు.  ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలతో  జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటేసింది. ఆ తర్వాత పరిణామాలతో  జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరారు.

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios