Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్ పొడిగింపు: ప్రభుత్వ రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్ల ఫార్ములా ఇదే!

లాక్ డౌన్ ని కొనసాగిస్తూనే కొన్ని మినహాయింపులు ఇవ్వాలని ప్రభుత్వం  యోచిస్తున్నట్టు తెలియవస్తుంది. ఈ మినహాయింపులను ఎక్కడెక్కడ ఎలా అమల్లోకి తేవాలి అని ప్రణాళికలో భాగంగా కలర్ కోడింగ్ ను ప్రవేశ పెట్టనున్నారు. 

Red, Orange, Green Zones In Centre's Plan To Navigate COVID-19 Lockdown
Author
New Delhi, First Published Apr 13, 2020, 8:16 AM IST

కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు మందు లేకపోవడంతో సోషల్ డిస్టెన్సిన్గ్ పాటిస్తూ, అవసరమైతే తప్ప బయటకు ప్రజలను వెళ్లనీయకుండా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే!

ఈ లాక్ డౌన్ వల్ల కరోనా మహమ్మారి వ్యాప్తిని భారత్ చాలావరకు అరికట్టగలిగిందనే చెప్పవచ్చు. కాకపోతే ఇలా దేశమంతా లాక్ డౌన్ లో ఉండడం వల్ల ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయి ప్రభుత్వానికి రాబడి శూన్యంగా మారింది. 

ఇప్పటికే విధించిన లాక్ డౌన్ రేపు 14వ తారీఖుతో ముగియనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు మొన్న శుక్రవారం నాడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ లాక్ డౌన్ విషయమై చర్చించారు. దాదాపుగా కూడా అన్ని రాష్ట్రాలు కూడా ఈ లాక్ డౌన్ ని మరో రెండు వారాలపాటు పొడిగించాలని ప్రధానిని కోరాయి. ప్రధాని కూడా అందుకు అంగీకారం తెలిపారు. 

కానీ ఉత్పత్తి రంగాన్ని పూర్తిగా మూసేయడం, ఆర్ధిక రాబడి ఆగిపోయింది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం పడిపోవడంతోపాటు ఎందరో కూలీలు, రెక్కాడితే కానీ డొక్కాడని వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా కొద్దీ మంది తిండి కోసం అలమటిస్తూనే ఉన్నారు. 

ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్ ని కొనసాగిస్తూనే కొన్ని మినహాయింపులు ఇవ్వాలని ప్రభుత్వం  యోచిస్తున్నట్టు తెలియవస్తుంది. ఈ మినహాయింపులను ఎక్కడెక్కడ ఎలా అమల్లోకి తేవాలి అని ప్రణాళికలో భాగంగా కలర్ కోడింగ్ ను ప్రవేశ పెట్టనున్నారు. 

ట్రాఫిక్ సిగ్నల్ రంగుల మాదిరి రెడ్, గ్రీన్, ఆరంజ్ జోన్లుగా ప్రాంతాలను గుర్తించామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ఇదే విషయాన్నీ కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజతో సహా పుదుచ్చేరి ముఖ్యమంత్రి వరకు అందరూ నొక్కి చెప్పారు. 

ఇంతవరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదవ్వని జిల్లాలను గ్రీన్ జోన్లుగా ప్రకటిస్తారు. దేశమంతటా అట్లాంటి జిల్లాలు ఇప్పటివరకు 400 ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 

ఆరంజ్ జోన్లుగా 15 అంతకన్నా తక్కువ కేసులు నమోదై, కేసుల సంఖ్యా పెరగకుండా ఉన్న జిల్లాలను ఆరంజ్ జోన్లుగా గుర్తించనున్నారు. ఈ రెండు జోన్లలో వ్యవసాయ పనులకు మినహాయింపు ఇవ్వడంతోపాటు ప్రజా రవాణా వ్యవస్థను కొద్దిగా, పరిమితులకు అనుగుణంగా  అందుబాటులోకి తేనున్నారు. 

15 అంతకన్నా ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తిస్తూ అక్కడ ఏ విధమైన మినహాయింపులు ఉండవు. సంపూర్ణ లాక్ డౌన్ అక్కడ కొనసాగుతుందని తెలియవస్తుంది. 

ఇలా ఆర్ధిక రంగ అవసరాన్ని నొక్కి చెబుతూ, తాను తొలిసారి లాక్ డౌన్ ప్రకటించేటప్పుడు మనం ఉంటె ప్రపంచం ఉంటుందని కాబట్టి తొలుత ప్రజల ప్రాణాలకు ప్రాముఖ్యతను ఇచ్చారు. మొన్నటి మీటింగ్ లో జీవితం ప్రపంచం రెంటిని కలిపి చూడాలని అన్నారు. 

కేవలం వ్యవసాయ రంగం ఒక్కటే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్, భవన నిర్మాణ రంగం, పరిశ్రమలకు కూడా సోషల్ డిస్టెంసింగ్ పాటిస్తూ పని చేసుకోవాలని చెబుతూ మినహాయింపులు  ఉందని తెలియవస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios