Coronavirus : మళ్లీ పెరిగిన కరోనా కేసులు..
దేశంలో Coronavirus కేసులు నిన్నటితో పోలిస్తే మళ్లీ పెరిగాయి. మరో వైపు ఒమిక్రాన్ కొత్త కేసులు వెలుగుచూస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి చర్యలను ముమ్మరం చేస్తున్నాయి.
దేశంలో నిన్న భారీగా తగ్గిన Coronavirus కేసులు ఇవాళ మళ్లీ పెరిగాయి. బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 8,439 మందికి కరోనా సోకింది. నిన్నటితో పోలిస్తే 23శాతం ఎక్కువగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 3,46,56,822కు చేరింది. ఇదే సమయంలో కోవిడ్-19 నుంచి 9,525 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా రికవరీల సంఖ్య 3,40,89,137 కు పెరిగింది. క్రియాశీల కేసులు సైతం లక్షకు దిగువన ఉండటం కాస్త ఊరట కలిగిస్తున్నది. ప్రస్తుతం దేశంలో మొత్తం 93,733 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read: రైతు ఉద్యమంపై నేడు ఎస్‌కేఏం ఏం నిర్ణయం తీసుకోనుంది?
ఇక గత 24 గంటల్లో Corona మహమ్మారితో పోరాడుతూ 195 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కోవిడ్-19 కారణంగా చనిపోయిన వారి సంఖ్య మొత్తం 4,73,952 కు పెరిగింది. ప్రస్తుతం నమోదైన కరోనా మరణాల్లో అధికంగా కేరళ, మహారాష్ట్రలోనే వెగులుచూశాయి. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 98.4 శాతంగా ఉంది. మరణాల రేటు 1.37 శాతంగా ఉంది. వారంతపు పాజిటివిటీ రేటు 5.3 శాతంగా ఉంది. కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, ఛత్తీస్ గఢ్ లు టాప్-10 లో ఉన్నాయి.
Also Read: హార్న్‌బిల్ ఫెస్టివల్ రద్దు.. AFSPAను రద్దు చేయాలంటూ డిమాండ్
యావత్ ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది కరోనా ఒమిక్రాన్ వేరియంట్. ఒమిక్రాన్ కేసులు భారత్‌లో కూడా నమోదుకావడం ఆందోళన కలిగిస్తున్నది. దీంతో ప్రభుత్వాలు Coronavirus పరీక్షలతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 64,94,47,014 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజే 10,79,384 కోవిడ్-19 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది. అలాగే, వ్యాక్సినేషన్ ప్రక్రియలో సైతం వేగం పెరిగింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 129.5 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. ఇందులో మొదటి డోసు తీసుకున్న వారి సంఖ్య 80.5 కోట్లకు చేరింది. 49.0 కోట్ల మంది పూర్తి వ్యాక్సిన్ (రెండు డోసులు) తీసుకున్నారు. భారత్‌లో ఇలాంటి పరిస్థితులు ఉండగా, ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది.
Also Read: భీమా కోరేగావ్ కేసు.. సుప్రీంకోర్టులో సుధా భరద్వాజ్‌కు ఊరట
వరల్డో మీటర్ Coronavirus డాష్‌బోర్డు వివరాల ప్రకారం... అన్ని దేశాల్లో కలిపి ఇప్పటివరకు మొత్తం 267,406,407 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అలాగే, 5,286,824 మంది కరోనా మహమ్మారి కారణంగా మరణించారు. 240,840,486 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్, బ్రెజిల్, యూకే, రష్యా, టర్కీ, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్, అర్జెంటీనా, స్పెయిన్, ఇటలీ దేశాలు టాప్‌లో ఉన్నాయి. గత నెలలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ చాలా దేశాల్లో పంజా విసురుతోంది. ఇప్పటికే ఒమిక్రాన్ 57కు పైగా దేశాలకు వ్యాపించింది. ఒమిక్రాన్ వెలుగుచూసిన దేశాల్లో కరోనా వైరస్ కొత్త కేసుల్లో గణనీయంగా పెరుగుదల నమోదైంది. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ నాల్గో వేవ్‌కు కారణమవుతున్నదనీ, ప్రస్తుతం కోవిడ్-19 ఫోర్త్ వేవ్ ప్రారంభమైందని అక్కడి నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆ దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో 70 శాతానికి పైగా ఒమిక్రాన్ కేసులు ఉన్నాయని అక్కడి అధికారులు పేర్కొంటున్నారు.
Also Read: భీమా కోరేగావ్ కేసు.. సుప్రీంకోర్టులో సుధా భరద్వాజ్‌కు ఊరట