ఇండియాలో గత 24 గంటల్లో 18,870 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే కేరళ (kerala) రాష్ట్రంలో 11 వేల కొత్త కరోనా కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో కేరళ రాష్ట్రంలో 378 మంది మృతి చెందారు.
న్యూఢిల్లీ: ఇండియాలో(india) గత 24 గంటల్లో 18,870 కరోనా (corona cases)కేసులు నమోదయ్యాయి.నిన్న ఒక్క రోజే15,04,718 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వరుసగా రెండో రోజు 20 వేలకు దిగువన కరోనా కేసులు నమోదయ్యాయి.దేశంలో నమోదౌతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా కేరళ రాష్ట్రం నుండే నమోదౌతున్నాయి.నిన్న ఒక్క రోజే కేరళ (kerala) రాష్ట్రంలో 11 వేల కొత్త కరోనా కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో కేరళ రాష్ట్రంలో 378 మంది మృతి చెందారు.
దేశంలో కరోనా కేసులు 3.37 కోట్లకు చేరుకొన్నాయి. కరోనాతో దేశ వ్యాప్తంగా 4.47 లక్షల మంది మృతి చెందారు. నిన్న ఒక్క రోజే కరోనా నుండి దేశంలో 28,178 మంది కోలుకొన్నారు.ఇండియాలో ఇప్పటివరకు కరోనా నుండి 3.29 మంది కోలుకొన్నారు.కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2,82,520కి చేరుకొంది. కరోనా యాక్టివ్ కేసుల రేటు 0.84 శాతానికి తగ్గింది. కరోనా రోగుల రికవరీ రేటు 97.83 శాతానికి పెరిగింది.
