భారత్‌లో కొత్తగా 12,830 మందికి కోవిడ్.. 247 రోజుల కనిష్ఠానికి యాక్టీవ్ కేసులు
భారత్‌లో 24 గంటల్లో 11,35,142 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 12,830 మందికి పాజిటివ్‌గా తేలింది. నిన్న 446 మంది కోవిడ్‌తో మృతి చెందగా.. ఇప్పటి వరకూ మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,58,186కి చేరింది.
భారత్‌లో కరోనా కేసులు (corona cases in india) స్వల్పంగా తగ్గాయి. 13 వేల దిగువకు కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు కొన్ని రాష్ట్రాలు మరణాల సంఖ్యను సవరిస్తుండటంతో వాటి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. కేంద్ర ఆరోగ్య శాఖ ( ministry of health and family welfare) ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 11,35,142 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 12,830 మందికి పాజిటివ్‌గా తేలింది. నిన్న 446 మంది కోవిడ్‌తో మృతి చెందగా.. ఇప్పటి వరకూ మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,58,186కి చేరింది.
కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం. తాజాగా 14,667 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ దేశంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 3.36 కోట్లు (98.20%) దాటింది. ప్రస్తుతం ఇండియాలో యాక్టీవ్ కేసుల సంఖ్య (active cases in india) 1,59,272కి తగ్గి 247 రోజుల కనిష్ఠానికి చేరింది. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ (vaccination) ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 68,04,806 మందికి టీకా డోసులు పంపిణీ చేశారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన మొత్తం డోసుల సంఖ్య 1.06 కోట్లు దాటింది.
Also Read:కరోనా థర్డ్ వేవ్: కేసులు పెరగడంతో ఆ పట్టణంలో సంపూర్ణ లాక్‌డౌన్
మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో Corona Virus Cases ఆందోళనకరంగా పెరిగాయి. దుర్గా నవరాత్రి ఉత్సవాలతో ప్రజలు బయట గుమిగూడటం.. వేడుక చేసుకోవడాలు జరిగాయి. ఫలితంగా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. కట్టడి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. మళ్లీ గతంలో మాదిరిగానే ఓ పట్టణంలో సంపూర్ణ Lockdown విధించింది. కేవలం మెడిసిన్స్, పాలు, రేషన్ సరుకులు, ఎలక్ట్రికల్ గూడ్స్ మినహా అన్ని షాపులూ మూసేయించింది. West Bengalలోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో కేసులు పెరిగాయి. ముఖ్యంగా సోనార్‌పూర్ మున్సిపాలిటీలో ఇవి అధికంగా రిపోర్ట్ అయ్యాయి. ఈ ఏరియా రాష్ట్ర రాజధాని కోల్‌కతాకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఏరియాలో కఠిన లాక్‌డౌన్ విధించింది. ఇప్పటి వరకు సోనార్‌పూర్‌లో 19 కంటైన్‌మెంట్ జోన్లను అధికారులు గుర్తించారు.
కేసులను కట్టడి చేయడానికి సోనార్‌పూర్ మున్సిపాలిటీ ఏరియాలో అధికారులు మూడు రోజులపాటు కఠిన లాక్‌డౌన్ విధించారు. ఈ ఆంక్షలపై అధికారులు శనివారం మరోసారి భేటీ కానున్నారు. ఆ సమావేశంలో కరోనా పరిస్థితులను సమీక్షించి లాక్‌డౌన్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. బెంగాల్‌లో వరుసగా రెండు రోజులుగా 800లకు తక్కువ కాకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఇక్కడ 805 కొత్త కేసులు నమోదవ్వగా, మంగళవారం 806 కేసులు రిపోర్ట్ అయ్యాయి. అంతకు ముందు రెండు రోజులు సుమారు వెయ్యి కేసులు నమోదయ్యాయి. మంగళవారానికి రాష్ట్రంలో మొత్తం కేసులు 15,88,066కి చేరాయి. కొత్తగా 15 మంది కరోనాతో మరణించగా మహమ్మారి కారణంగా మరణించినవారి మొత్తం సంఖ్య 19,081కి పెరిగాయి.