Asianet News TeluguAsianet News Telugu

Omicron Variant | దేశంలో 41 ఒమిక్రాన్ కేసులు.. ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోకుంటే విప‌త్తే..

Omicron Variant: ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్ర‌పంచ‌దేశాల‌కు వేగంగా విస్త‌రిస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉండ‌టం, వ్యాక్సిన్ సామ‌ర్థ్యాన్ని త‌గ్గిస్తున్న‌ద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ, వైద్య నిపుణులు హెచ్చ‌రిక‌లు భ‌యాందోళ‌న‌ను పెంచుతున్నాయి. భార‌త్ లో ఒమిక్రాన్ కేసులు సైతం క్ర‌మంగా పెరుగుతుండ‌టం క‌ల‌క‌లం రేపుతున్న‌ది. ముందస్తు చర్యలు తీసుకోకుంటే.. తీవ్ర పరిణామాలుంటాయని నిపుణులు, విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 
 

India Report 41 Corona Omicron Variant Cases
Author
Hyderabad, First Published Dec 14, 2021, 9:17 AM IST

Omicron Variant: గ‌త నెల‌లో ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన క‌రోనా కొత్త వేరియంట్.. అక్క‌డ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దీని వ్యాప్తితో పాటు ఒమిక్రాన్ టీకా సామ‌ర్థ్యాన్ని త‌గ్గిస్తుంద‌నే అంచ‌నాలు భ‌యాందోళ‌న‌ల‌ను పెంచుతున్నాయి. భార‌త్‌లో ఒమిక్రాన్ కేసులు సైతం క్రమండా పెరుగుతుండ‌టంపై ప్ర‌భుత్వంతో పాటు ప్ర‌జ‌ల్లోనూ ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించిన దేశాల నుంచి వ‌చ్చిన వారిలో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ గా తేలుతుండ‌టంతో ప్ర‌భుత్వం అంత‌ర్జాతీయ ప్ర‌యాణాలు చేసివ‌చ్చిన వారిపై దృష్టి సారించింది.  సోమవారం మహారాష్ట్రలో రెండు కేసులు, గుజరాత్ లో ఓ ఒమిక్రాన్ కేసులు వెగులుచూశాయి. ఈ కేసుల‌తో కలిపి దేశంలో ఒమిక్రాన్ కేసులు మొత్తం 41కి చేరింది.  ఈ కేసులు మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో న‌మోద‌య్యాయి.  కేసులు అధికంగా మహారాష్ట్రలో న‌మోద‌య్యాయి. ఇప్ప‌టికే ఈ వేరియంట్ కేసులు 20కి చేరాయి.  దేశంలోని వివిధ రాష్ట్రాల్లో న‌మోదైన ఒమిక్రాన్ కేసులు వివ‌రాల‌ను గ‌మ‌నిస్తే... అధికంగా మ‌హారాష్ట్రలో 20 కేసులు న‌మోద‌య్యాయి. ఈ త‌ర్వాతి స్థానంలో ఉన్న రాజస్థాన్ – 9, గుజరాత్ 4, కర్ణాటక 3, ఢిల్లీలో 2, ఛండిగ‌ఢ్ 1, కేరళ 1, ఏపీలో ఒక ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.

Also Read: Justice Chandru: అవగాహన లేని మాట‌లు.. జ‌స్టిస్ చంద్రు వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

ఇదిలావుండ‌గా, విదేశాల నుంచి వ‌చ్చిన వారిలోనే ఇప్ప‌టివ‌ర‌కు ఒమిక్రాన్ కేసుల‌ను గుర్తించారు. విదేశీ ప్ర‌యాణాలు చేసిన‌వారికి విమానాశ్ర‌యాల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ప్ప‌టికీ.. వారికి అక్క‌డ నెగ‌టివ్ వ‌స్తున్న‌ది.  వారిలో చాలా మంది  రెండు మూడు రోజుల్లో అనారోగ్యాన్ని గురై ఆస్ప‌త్రుల‌కు వెళ్ల‌డంతో వెలుగుచూస్తున్న క‌రోనా వైర‌స్ కేసులు అధికంగా ఉంటున్నాయ‌ని అధికారులు తెలుపుతున్నారు. ఈ త‌ర‌హాలోనే  తాజాగా మహారాష్ట్రలో 12 సంవ‌త్స‌రాల ఓ బాలిక‌కు కోవిడ్‌-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకిన‌ట్టు గుర్తించారు. ఒమిక్రాన్ బాదిత బాలిక కుటుంబం ఇటీవ‌లే  నైజీరియా నుంచి మహారాష్ట్రకు వచ్చింది.  వారికి ఎయిర్ పోర్టులోనే క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అయితే, అక్క‌డ వారికి నెగ‌టివ్ వ‌చ్చింది.  వారు ఇంటికి చేరుకున్న రెండుమూడు రోజుల‌కు  పంటి నొప్పితో హ‌స్పిటల్‌కు  వెళ్లడంతో ఆర్టీపీసీఆర్ చేయించాలని వైద్యులు సూచించారు.  క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, ఆమెకు కరోనా నిర్దారణ అయింది. వెంటనే జ‌న్యు ప‌రీక్ష‌లు చేయగా ఆమెకు ఒమిక్రాన్ నిర్దారణ అని తేలింది.

Also Read: Justice Chandru: అవగాహన లేని మాట‌లు.. జ‌స్టిస్ చంద్రు వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

ఒమిక్రాన్ కేసుల పెరుగుద‌ల నేప‌థ్యంలో ప్ర‌భుత్వం క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి కోసం చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేసింది. కోవిడ్-19 వ్యాక్సినేష‌న్‌తో పాటు ప‌రీక్ష‌ల‌ను సైతం పెంచింది. క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అధికారులు క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు. ఇదిలావుండ‌గా, చాలా దేశాల్లో ఒమిక్రాన్ భయాందోళ‌న‌లు అధికం అవుతున్నాయి. సోమ‌వారం బ్రిట‌న్‌లో ఒమిక్రాన్ కార‌ణంగా తొలి మ‌ర‌ణం న‌మోదైంది. దీనిని ఆ దేశ ప్ర‌ధాని బోరిస్‌ జాన్సన్‌ ధ్రువీక‌రిస్తూ..  ఒమిక్రాన్‌ 'భారీ అలలా ముంచుకొస్తోంది' అని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇక  భారత్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చేందే అవకాశాలు అధికంగా ఉన్నాయని దక్షిణాఫ్రికా డీఎస్‌ఐ-ఎన్‌ఎస్‌ఎఫ్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ ఎపిడెమియాలజికల్‌ మోడలింగ్‌ అండ్‌ ఎనాలిసిస్‌ డైరెక్టర్‌ జూలియట్‌ పుల్లియం అంచనా వేశారు. కాబ‌ట్టి ప‌రిస్థితులు దిగ‌జార‌క‌ముందే ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలిపింది. దీనిలో భాగంగా ఆస్పత్రులు, వైద్య సౌకర్యాల కల్పనకు సిద్ధం కావడం అత్యంత కీలక తెలివైన పని అని ఆమె అన్నారు. లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 

Also Read: Farooq Abdullah | దేశ విభజనపై ఫ‌రూక్ అబ్దుల్లా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

Follow Us:
Download App:
  • android
  • ios