Modi - Sushila Karki : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటిసారి నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీల కర్కితో మాట్లాడారు. ఈ విషయాన్ని స్వయంగా మోదీ వెల్లడించారు. ఇంతకూ ఆమెతో ఏం మాట్లాడారో తెలుసా?   

Modi - Sushila Karki : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీల కర్కితో తొలిసారి ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా నేపాల్‌లో ఇటీవల జరిగిన ప్రాణనష్టంపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అక్కడ శాంతిని నెలకొల్పే ప్రయత్నాలకు భారత్ తరఫున సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

 నేపాల్ ప్రధానితో మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే… 

ప్రధాని మోదీ సోషల్ మీడియా ఎక్స్‌లో ఒక పోస్ట్ షేర్ చేస్తూ.. "నేపాల్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాని సుశీల కర్కితో మాట్లాడాను. ఇటీవల నేపాల్ లో జరిగిన ప్రాణనష్టంపై నా ప్రగాఢ సంతాపం తెలిపాను. నేపాల్‌లో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించే వారి ప్రయత్నాలకు భారత్ అండగా ఉంటుందని పునరుద్ఘాటించాను. అలాగే ఆమెకు, నేపాల్ ప్రజలకు వారి జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు ముందుగానే తెలియజేశాను" అని రాశారు.

Scroll to load tweet…

నేపాల్ జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు

ప్రధాని మోదీ నేపాల్ జాతీయ దినోత్సవం (సెప్టెంబర్ 19) సందర్భంగా ప్రధాని సుశీల కర్కికి, అక్కడి ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే కాలంలో భారత్-నేపాల్ సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

 నేపాల్ లో శాంతి, అభివృద్ధికి ఉమ్మడి మార్గం గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ…. భారత్, నేపాల్ కలిసి ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేయగలవని అన్నారు. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య మరింత లోతైన సహకారం, బలమైన భాగస్వామ్యం ఉంటుందని ఆశిస్తున్నట్లు మోదీ తెలిపారు.