విడిపోయిన భారత్-పాక్ లెస్బియన్ జంట.. పెళ్లికి కొన్ని వారాల ముందు నిర్ణయం..
2019లో ఫొటో షూట్ ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అయిన భారత్ కు చెందిన అంజలి చక్ర, పాకిస్థాన్ కు చెందిన సూఫీ మాలిక్ లు విడిపోతున్నట్టు ప్రకటించారు. మరి కొన్ని వారాల్లో పెళ్లి ఉందనగా.. ఈ లెస్బియన్ జంట షాకింగ్ విషయం చెప్పింది.
భారత్ కు చెందిన అంజలి చక్ర, పాకిస్థాన్ కు చెందిన సూఫీ మాలిక్ లు తమ వివాహానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. 2019లో ఈ లెస్బియన్ జంట తమ ప్రేమను గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంది. అది ఆ సమయంలో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. అయితే ఈ జంట తాజాగా తాము విడిపోతున్నామంటూ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇన్ స్టాగ్రామ్ ద్వారా వారిద్దరూ ఈ విషయాన్ని వెల్లడించారు.
గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీ ఆరోగ్య పరిస్థితి విషమం..
ఐదేళ్ల క్రితం అంజలి, సూఫీల ప్రేమ ప్రయాణం మొదలైంది. హద్దులు, సాంస్కృతిక కట్టుబాట్లకు అతీతమైన ప్రేమ తమది అంటూ పలువురి హృదయాలను ఈ జంట కొల్లగొట్టింది. ఏడాది ముందు వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. న్యూయార్క్ లోని ప్రఖ్యాత ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ లో అంజలికి సూఫీ ప్రపోజ్ చేయగా, ఆ క్షణాలను వీడియో పోస్ట్ ద్వారా తమ ఫాలోవర్స్ తో పంచుకున్నారు.
మరి కొన్ని వారాల్లో పెళ్లి ఉందనగా.. తాను అంజలిని మోసం చేసినట్లు సూఫీ అంగీకరించడంతో ఈ జంట కల అర్ధాంతరంగా ముగిసింది.‘‘పెళ్లికి కొన్ని వారాల ముందు ఆమెను మోసం చేసి, తప్పు చేశాను. నాకు అర్థంకాని విధంగా ఆమెను తీవ్రంగా గాయపరిచాను. నేను నా తప్పును అంగీకరిస్తున్నాను.. మా కుటుంబం, స్నేహితులతో పాటు నేను ఎక్కువగా ప్రేమించే, కేర్ తీసుకొనే వ్యక్తులను కూడా నా చర్యల ద్వారా గాయపరిచాను.’’ అని సూఫీ తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో వెల్లడించారు.
‘‘ఇది షాక్ కలిగించవచ్చు, కానీ మా ప్రయాణం మారుతోంది. సూఫీ చేసిన నమ్మకద్రోహం కారణంగా మా వివాహాన్ని రద్దు చేసుకుని మా సంబంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాం’’ అని అంజలి కూడా పోస్ట్ చేశారు. కాగా.. అమెరికాలో ఉంటున్న ఈ ముస్లిం-హిందూ స్వలింగ జంట సూఫీ మాలిక్, అంజలి చక్ర 2019లో తమ అద్భుతమైన జంట ఫోటోషూట్ ద్వారా సోషల్ మీడియాలో వైరల్ గా మారారు.