Asianet News TeluguAsianet News Telugu

పాకిస్తాన్ బార్డర్‌లో దీపావళి వేడుక.. మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్న బలగాలు.. వీడియో ఇదే

దీపావళి వేడుకలు ఈ రోజు పాకిస్తాన్ సరిహద్దులోనూ జరిగాయి. భారత్, పాకిస్తాన్ భద్రతా బలగాలు మిఠాయిలు పంచుకున్నారు. జమ్ము కశ్మీర్, రాజస్తాన్, గుజరాత్ సహా పలుప్రాంతాల్లో సరిహద్దు దగ్గర ఆర్మీ బలగాలు పరస్పరం స్వీట్లు పంచుకుని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నాయి. ఈద్, దీపావళి, హోలీ వంటి ప్రధాన పండుగలకు ఇలా మిఠాయిలు పంచుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.

india pakistan forces exchanges sweets on the occassion of diwali
Author
New Delhi, First Published Nov 4, 2021, 6:32 PM IST

న్యూఢిల్లీ: Pakistan సరిహద్దు అనే మాట సాధారణంగా కాల్పులు, ఎన్‌కౌంటర్లు, కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన సమయాల్లో ఎక్కువగా వింటుంటాం. లేదా ఉగ్రవాదుల చొరబాట్ల గురించిన వార్తల్లో చదువుతుంటాం. కానీ, ఈ సారి దీపావళి వేడుక  కారణంగా  పాకిస్తాన్ Border తెరమీదకు వచ్చింది. ఔను.. భారత్, పాకిస్తాన్ సరిహద్దులో దీపావళి వేడుక జరిగింది. అంటే.. ఉభయ దేశాల ఆర్మీ బలగాలు మిఠాయిలను ఇచ్చిపుచ్చుకున్నాయి. పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నాయి. 

జమ్ము కశ్మీర్‌లోని తీత్వాల్ దగ్గర క్రాసింగ్ బ్రిడ్జీపై ఉభయ దేశాల సైనికులు నడుచుకుంటూ వచ్చి మిఠాయిలు పంచుకున్నారు. జమ్ము కశ్మీర్‌లోనే కాదు.. రాజస్తాన్, గుజరాత్ రాష్ట్రాల్లోనూ సరిహద్దులో Sweetsను పంచుకున్నారు. గుజరాత్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద అట్టారీ వాగాహ్ దగ్గర బీఎస్ఎఫ్, పాకిస్తాన్ రేంజర్స్ స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు. Diwali పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాజస్తాన్‌లో బర్మార్ సెక్టార్‌లనూ ఇరుదేశాల Forces మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నారు.

ఇరుదేశాల మధ్య యుద్ధాలు జరిగిన చరిత్ర ఉన్నది. దేశ విభజన జరిగినప్పుడు మారణహోమం జరిగింది. జమ్ము కశ్మీర్‌లోని పాకిస్తాన్ సరిహద్దులో ఎప్పుడూ అరాచకమే ఉంటుంది. తుపాకీ తూటాలు, బాంబుల మోతలు అక్కడ సాధారణమై పోయాయి. పాకిస్తాన్ పలుసార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి ఉల్లంఘించి భారత జవాన్లను పొట్టనబెట్టుకున్నది. ఇది ఒక వైపు అయితే, మరో వైపు.. ప్రధాన పండుగలకు సరిహద్దులోని ఉభయ దేశాల బలగాలు ఇలా మిఠాయిలు పంచుకుంటూ ఉంటాయి. ఈద్, హోలీ, దీపావళి వంటి ప్రధాన పండుగలు, ఉభయ దేశాల స్వాతంత్ర్య దినోత్సవాలకు ఇలా మిఠాయిల పంచుకుంటున్న ఆనవాయితీ ఎప్పటి నుంచో వస్తున్నది. 

పాకిస్తాన్ వైపే కాదు.. బంగ్లాదేశ్ వైపు కూడా దీపావళి వేడకలు జరిగాయి. ఇండియా బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వెంట భారత్‌కు చెందిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్(బీజీబీ)లు మిఠాయిలు పంచుకున్నాయి. నిన్న రాత్రే ఇరు దేశాల బలగాలు స్వీట్లు పంచుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios