‘భారతదేశం గర్విస్తోంది’ : గ్రామీ విజేతలు జాకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్‌లకు ప్రధాని అభినందనలు..
గ్రామీ-విజేత ఫ్యూజన్ బ్యాండ్ శక్తి, దాని సభ్యులు జాకీర్ హుస్సేన్, స్వరకర్త-గాయకుడు శంకర్ మహదేవన్‌లను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అభినందించారు.
ఢిల్లీ : భారత గ్రామీ విజేతలు జాకీర్ హుస్సేన్, రాకేష్ చౌరాసియా, శంకర్ మహదేవన్, గణేష్ రాజగోపాలన్, సెల్వగణేష్ విలను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అభినందించారు. వీరి ఫ్యూజన్ బ్యాండ్ ‘శక్తి’ ఫిబ్రవరి 5 న గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ గ్రామీని గెలుచుకుంది.
గ్రామీ విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు తెలుపుతూ...
"గ్రామీలో అద్భుత విజయం సాధించినందుకు జాకీర్ హుస్సేన్, రాకేష్, శంకర్, సెల్వ, గణేష్ లకు అభినందనలు! మీ అసాధారణ ప్రతిభ, సంగీతం పట్ల అంకితభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజిక్ లవర్స్ హృదయాలను గెలుచుకున్నాయి. మీ విజయానికి భారతదేశం గర్విస్తోంది. ఈ విజయాలు మీ కృషికి నిదర్శనం. కొత్త తరం కళాకారులు పెద్ద కలలు కనడానికి, సంగీతంలో రాణించడానికి కూడా ఇది స్ఫూర్తినిస్తుంది" అని ప్రధానమంత్రి తన పోస్టులో పేర్కొన్నారు.
జాన్ మెక్‌లాఫ్లిన్, జాకీర్ హుస్సేన్, గాయకుడు శంకర్ మహదేవన్, పెర్కషన్ విద్వాంసుడు వి సెల్వగణేష్, వయోలిన్ వాద్యకారుడు గణేష్ రాజగోపాలన్ ల ఫ్యూజన్ బ్యాండ్ శక్తి, ఫిబ్రవరి 5 (IST) లాస్ ఏంజిల్స్‌లో జరిగిన గ్రామీ అవార్డ్స్‌లో గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ విజేతగా నిలిచింది. వారు తమ తాజా ఆల్బమ్ 'ది మూమెంట్'కి అవార్డును గెలుచుకున్నారు.
ఏఆర్ రెహమాన్, రికీ కేజ్ ఎలా స్పందించారంటే..
ప్రధానమంత్రితో పాటు, ఏఆర్ రెహమాన్, రికీ కేజ్ వంటి ప్రముఖులు కూడా దీనిమీద స్పందించారు. రెహమాన్ అవార్డుల వేడుక దగ్గరినుంచి సెల్ఫీని షేర్ చేశారు. పోస్ట్‌కు క్యాప్షన్‌గా, "భారతదేశానికి గ్రామీల పంట పండింది. గ్రామీ విజేతలు మూడు గ్రామీలు అందుకున్న ఉస్తార్ జాకీర్ హుస్సేన్, మొదటి గ్రామీలు అందుకుంటున్న శంకర్ మహాదేవన్, సెల్వగణేష్ లతో అంటూ ఈ సెల్ఫీకి కాప్షన్ పెట్టారు.
ఈ రాత్రి ఈ విజయాలతో భారత్ పేరు మారుమోగుతోంది. ఈ రాత్రి భారత్ పేరు.. అంటూ రికీ కేజ్ అన్నారు. రికీ కేజ్ స్వయంగా మూడుసార్లు గ్రామీ-విజేతగా నిలిచారు. గ్రామీ అవార్డుల కార్యక్రమం ఫిబ్రవరి 5 (IST) లాస్ ఏంజిల్స్‌లో జరిగాయి.