Asianet News TeluguAsianet News Telugu

భారతదేశం విచ్చిన్నమైంది - కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

భారతదేశం విచ్చిన్నమైందని, దానిని కలిపేందుకు తమ పార్టీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు దేశాన్ని మతం, భాష, కులం ఆధారంగా విభజిస్తున్నాయని ఆయన ఆరోపించారు. 

India is broken - Congress leader Mani Shankar Iyer's sensational comments
Author
First Published Dec 28, 2022, 1:56 PM IST

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం విచ్ఛిన్నమైందని, తమ పార్టీ దేశాన్ని చక్కదిద్దే పని చేస్తోందని చెప్పారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర చేపడుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ భారత్ జోడో యాత్ర ఉద్దేశంపై  రాహుల్ గాంధీ చేసిన ప్రకటనకు అయ్యర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. 

‘‘మొదట మనం భారతదేశాన్ని ఏకం చేయాలి. తరువాత ఎన్నికలపై దృష్టి పెడతాం. ఈ మొత్తం సమయంలో ప్రతిపక్ష పార్టీలు కూడా కలిసి వస్తాయని నేను ఆశిస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోడీకి మనం గట్టి సవాలు విసురుతాం ’’ అని ఆయన ‘టైమ్స్ నౌ’తో అన్నారు. భారతదేశం విభజించబడిందా అని అడిగినప్పుడు ‘‘తూటా హువా హై’’ అని ఆయన అన్నారు. అందుకే దీన్ని ఐక్యం చేయాల్సిన అవసరం ఉందని అయ్యర్ తెలిపారు.

ఛత్తీస్‌గఢ్ యూనివర్శిటీలో విద్యార్థినికి ప్రొఫెసర్‌ లైంగిక వేధింపులు, అరెస్ట్..

భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లు దేశాన్ని మతం, భాష, కులం ఆధారంగా విభజిస్తున్నాయని ఆయన విమర్శించారు. ‘‘మతం, భాష, కులం ఆధారంగా భారతదేశాన్ని ‘తుక్డే-తుక్డే’గా విభజించింది సంఘ్ పరివార్ ప్రజలే. ఈ యాత్ర దానికి వ్యతిరేకం. దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా మనం పోరాడాలి’’ అని ఆయన అన్నారు.

మణిశంకర్ అయ్యర్ పై బీజేపీ ఫైర్
మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ 1947లో దేశ విభజన సమయంలో మాత్రమే భారత్ విచ్ఛిన్నమైందని అన్నారు. సర్దార్ పటేల్ ను బలహీనపరిచేందుకు కాంగ్రెస్ ఇప్పుడు రాజస్థాన్ నుంచి కర్ణాటకకు విచ్ఛిన్నమైందని ఆరోపించారు. ‘‘భారత్ తుటా హువా హై అంటున్నారు మణిశంకర్ అయ్యర్! సర్దార్ పటేల్ భారతదేశాన్ని సమైక్యం చేయలేకపోయారని రాహుల్ గాంధీ ఆ పని చేస్తారా? కాంగ్రెస్ పార్టీ వల్లే దేశవిభజన జరిగింది ’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తాం.. : రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్

అయ్యర్ వ్యాఖపై వ్యాఖ్యపై బీజేపీకి చెందిన రామ్ కదమ్ స్పందిస్తూ.. కాంగ్రెస్ నేతలు సిగ్గుపడాలని, దేశాన్ని కించపరిచేందుకు ఆ పార్టీ నేతలు ఎందుకు అంత ఆరాటపడుతున్నారని తెలిపారు. ‘‘ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ సిగ్గుపడాలి. వాళ్లు (కాంగ్రెస్) భారతదేశం విచ్చిన్నమైందని, దాన్ని బాగుచేస్తున్నారని అంటున్నారు. భారత దేశాన్ని అధోగతి పాలు చేయడానికి కాంగ్రెస్ నేతలకు ఎందుకంత మక్కువ?  దేశానికి క్షమాపణలు చెప్పండి’’ అని ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ బెంగాల్ దశ ‘భారత్ జోడో యాత్ర’ను బుధవారం ఉదయం దక్షిణ 24 పరగణాల జిల్లాలోని గంగా సాగర్ ద్వీపం నుండి రాష్ట్ర పార్టీ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర పేరు ‘సాగర్ సే పహర్ తక్’ గా కొనసాగుతుంది. ఈ యాత్ర రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సుమారు 800 కిలోమీటర్లు ప్రయాణించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన జనవరి 23 న ఉత్తర బెంగాల్ లోని కుర్సియోంగ్ వద్ద ముగుస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios