Asianet News TeluguAsianet News Telugu

ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తాం.. : రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్

Jaipur: జైపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్.. ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తమ పోరాటం సాగుతోందని చెప్పారు. వారు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నార‌నీ, ప్రజలు దీనిని సహించరని పేర్కొన్నారు. 50 ఏళ్ల తర్వాత ఓ దళితుడు త‌మ పార్టీకి అధ్యక్షుడయ్యాడ‌నీ, ఇది మాకు గొప్ప క్షణం అని ఆయ‌న తెలిపారు. 
 

Our fight is against the ideology of RSS and BJP: Rajasthan CM Ashok Gehlot
Author
First Published Dec 28, 2022, 1:01 PM IST

Rajasthan Chief Minister Ashok Gehlot:  కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ మ‌రోసారి కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీ జ‌న‌తా పార్టీ (బీజేపీ), ఆర్ఎస్ఎస్ ల‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా త‌మ పోరాటం కొన‌సాగుతుద‌ని చెప్పారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నార‌నీ, ప్రజలు దీనిని సహించరని పేర్కొన్నారు. 50 ఏళ్ల తర్వాత ఓ దళితుడు త‌మ పార్టీకి అధ్యక్షుడయ్యాడ‌నీ, ఇది మాకు గొప్ప క్షణం ఆయ‌న తెలిపారు. 

వివ‌రాల్లోకెళ్తే.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బుధ‌వారం నాడు కాంగ్రెస్ పార్టీ పార్టీ 138వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. ఈ సంద‌ర్భంగా జైపూర్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాట్లాడుతూ, “మా పోరాటం ఆర్ఎస్ఎస్, బీజేపీలకు వ్య‌తిరేకంగా కొన‌సాగుతుంది. వారు ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారు.. ప్రజలు దీనిని సహించరు.. 50 సంవత్సరాల తర్వాత, ఒక దళితుడు మా పార్టీకి అధ్యక్షుడయ్యాడు.. ఇది మాకు గొప్ప గ‌ర్వించ‌ద‌గ్గ క్ష‌ణం" అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ప్రజలతో సంబంధాలు తెగిపోయాయన్న వాస్తవాన్ని అంగీకరిస్తూ.. మ‌ళ్లీ కాంగ్రెస్ గ‌త వైభ‌వాన్ని అందిపుచ్చుకుంటుంద‌ని తెలిపారు. దీని కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టార‌ని చెప్పారు. భార‌త్ జోడో యాత్ర పూర్తయిన తర్వాత మరికొన్ని కార్యక్రమాలతో ప్ర‌జ‌ల్లోకి వెళ్తామ‌ని చెప్పారు. ఇతర మంత్రులు, పార్టీ కార్యకర్తలతో సమన్వయం చేస్తూ మ‌రిన్ని కార్య‌క్రమాల‌తో ముందుకు సాగుతామ‌ని చెప్పారు.

 

కాగా, సెప్టెంబర్‌లో పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గే ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యక్రమానికి హాజరైన తర్వాత ముంబ‌యిలో ఏర్పాటు చేసిన వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అయితే, పార్టీ సంప్రదాయాన్ని మారుస్తూ, 37 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు 1885లో పార్టీని స్థాపించిన ముంబైని వ్యవస్థాపక దినోత్సవం రోజున సందర్శించనున్నారు. భారత జాతీయ కాంగ్రెస్ డిసెంబర్ 28, 1885న అప్పటి బొంబాయి (ముంబై)లో దాస్ తేజ్‌పాల్ సంస్కృత కళాశాలలో 72 మంది ప్రతినిధుల సమక్షంలో స్థాపించబడింది. దీని స్థాపకుడు జనరల్ సెక్రటరీ ఏవో  హ్యూమ్ కాగా, డ‌బ్ల్యూసీ బెనర్జీ అధ్యక్షుడయ్యారు. అన్ని రాష్ట్రల‌ ప్రధాన కార్యాలయాలతో పాటు, ప్రధాన కార్యక్రమం సాధారణంగా ఢిల్లీలోని జాతీయ ప్రధాన కార్యాలయంలో జరుగుతుందని కాంగ్ర‌స్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 

1985లో దాని శతాబ్ది సంవత్సరంలో, రాజీవ్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ముంబ‌యిలో పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరయ్యారు. ఆ సంవత్సరం ముంబ‌యిలోనే ప్రధాన కార్యక్రమం జరిగింది. ఇటీవల ముగిసిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్గే బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఓడిపోయింది. పార్టీ స్థాపన దినోత్సవం రోజున మూలస్థానాన్ని సందర్శించడం ద్వారా, పార్టీ విలువల గురించి కార్యకర్తలకు సందేశం ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios