Asianet News TeluguAsianet News Telugu

భారత్ హెర్డ్ ఇమ్యూనిటీని పొందింది.. బీఎఫ్-7 వేరియంట్ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు - సీసీఎంబీ చీఫ్ వినయ్

భారతదేశం హెర్ద్ ఇమ్యూనిటీని గతంలోనే పొందిందని సీసీఎంబీ చీఫ్ వినయ్ కే నందికూరి తెలిపారు. దీని వల్ల కొత్తగా వచ్చే ఏ కరోనా వేరియంట్ అయినా భారతీయులపై పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. 

India gets herd immunity.. BF-7 variant may not have much impact - CCMB Chief Vinay
Author
First Published Dec 25, 2022, 1:38 PM IST

కోవిడ్ కొత్త వేరియంట్ బీఎఫ్ - 7 చైనాలో చూపిస్తున్నంత ప్రభావం ఇండియాలో చూపించకపోవచ్చని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ చీఫ్ వినయ్ కే నందికూరి అన్నారు. భారతీయులు ఇప్పటికే హెర్డ్ ఇమ్యూనిటీ పొందారని తెలిపారు. శనివారం ఆమె వార్తా సంస్థ ‘పీటీఐ’తో మాట్లాడారు. కొత్త వేరియంట్లన్నీ రోగనిరోధక శక్తి నుండి తప్పించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని అన్నారు. కొన్నిసార్లు టీకాలు వేసినవారు కూడా, ఒమిక్రాన్ మునుపటి వేరియంట్ల బారిన పడే అవకాశం ఉందని తెలిపారు.

వృద్ధ దంపతుల హ‌త్య‌.. ప్ర‌ధాన సూత్ర‌ధారి 12 బాలుడు స‌హా మ‌రో ఇద్ద‌రు అరెస్టు

‘‘ఇన్ఫెక్షన్ తీవ్రత డెల్టాతో పోలిస్తే అంత ఎక్కువగా లేదు. ఎందుకంటే మనకు హెర్ద్ ఇమ్యూనిటీ కొంత వరకు వచ్చేసింది. మనం గతంలో ఇతర వైరస్ బారిన పడ్డాం. కాబట్టి హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చింది’’ అని ఆయన తెలిపారు. ‘డెల్టా వేవ్ ను మనం (భారత్) చూశాం. అప్పుడు మనం టీకాలు వేయించుకున్నాం. తరువాత ఒమిక్రాన్ వేవ్ వచ్చింది. తరువాత మనం బూస్టర్ డోసులు వేసుకున్నాం. ఇలా అనేక విధాలుగా మనకు ఇమ్యూనిటీ వచ్చేసింది. వీటన్నింటి వల్ల భారత్ లో కొత్త వేరియంట్ చైనాలో చూపించినంత ప్రభావం భారత్ లో చూపించకపోవచ్చు.’’ అని వినయ్ కే నందికూరి తెలిపారు.

26 ఏళ్లలో 21 పెళ్లిళ్లు:తమిళనాడులో నిత్య పెళ్లికొడుకు అరె'స్ట్

చైనా అనుసరించిన జీరో కోవిడ్ పాలసీ ఆ దేశంలో కరోనా వ్యాప్తికి ఒక కారణమని అన్నారు. తక్కువ స్థాయిలో టీకాలు వేయడం కూడా దీనికి మరో కారణం అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వాస్తవానికి చైనా అనుసరించిన జీరో కోవిడ్ పాలసీ వల్ల చైనాలోని చాలా మంది ప్రజలు వ్యాక్సిన్ కోసం బయటకు వెళ్లలేదని అన్నారు. భారత్ లో పెద్దలందరికీ టీకాలు ఇచ్చారని, అనేక మంది బూస్టర్ డోసులు కూడా వేసుకున్నారని వినయ్ కే నందికూరి చెప్పారు. 

2022 'ఆత్మనిర్భర్ భారత్' సంవత్సరం.. అంతరిక్షం, రక్షణ రంగంలో సత్తాచాటిన భారత్: ప్ర‌ధాని మోడీ

ప్రస్తుతం ఉన్న నివేదికల ప్రకారం కొత్త వేవ్ మన దేశంలో అంత ఆందోళన కలిగించే అవకాశం కనిపించడం లేదని అన్నారు. మన దేశానికి ఇప్పుడు కోవిడ్ పరీక్షలతో పాటు చికిత్స సామర్థ్యం కూడా ఉందని అన్నారు. కాగా.. భారత్ లో కొత్తగా 201 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,397కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. అయితే ఇప్పటి వరకు కరోనా వైరస్  బీఎఫ్-7 వేరియంట్ కు సంబంధించిన నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయి.

Follow Us:
Download App:
  • android
  • ios