New Delhi: ''2022లో తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రారంభం కావడం ఇది దేశ‌ 'ఆత్మనిర్భర్ భారత్' సంవత్సరం. అంతరిక్షం, డ్రోన్, రక్షణ రంగాల్లో భారత్ త‌న సత్తాను చాటింది" అని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొవడంలో మెరుగైన పనితీరును కనబర్చిందని తెలిపారు.  

Prime Minister Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం తన నెలవారీ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో 96వ, ఈ సంవత్సరం చివరి ఎడిషన్ లో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ''2022వ సంవ త్స రం అద్భుత మైంది, భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవ త్సరాలు పూర్తయ్యాయి. భారతదేశం వేగంగా పురోగమించింది. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది'' అని ప్ర‌ధాని మోడీ అన్నారు. అలాగే, క‌రోనావైర‌స్ మ‌హ‌మ్మారిని ఎదుర్కొవ‌డంలో మెరుగ్గా ప‌నిచేసిందనీ, భారతదేశం 220 కోట్ల వ్యాక్సినేషన్ మైలురాయిని తాకిందని చెప్పారు. 2022 లో భారత ఎగుమతులు 440 బిలియన్ డాలర్లను అధిగమించాయని కూడా ఆయన పేర్కొన్నారు.''2022లో తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రారంభం కావడం ఇది దేశ‌ 'ఆత్మనిర్భర్ భారత్' సంవత్సరం. అంతరిక్షం, డ్రోన్, రక్షణ రంగాల్లో భారత్ త‌న సత్తాను చాటింది" అని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. 

Scroll to load tweet…

భారతదేశ ఆరోగ్య రంగం గురించి ప్రధానమంత్రి మోడీ ప్రస్తావిస్తూ.. రొమ్ము క్యాన్సర్ ఉన్న రోగులకు యోగా ప్రభావవంతంగా ఉంటుందని ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ పరిశోధనలో తేలిందని తెలిపారు. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల రోగులలో వ్యాధి పునరావృతం కావడం 15 శాతం తగ్గిందని కేంద్రం తెలిపిందన్న విష‌యాన్ని గుర్తు చేశారు. ''గ త కొన్ని సంవ త్సరాలలో ఆరోగ్య రంగంలోని వివిధ సమస్యలను మనం అధిగమించాం. మశూచి, పోలియో లాంటి వ్యాధులను భారత్ నుంచి నిర్మూలించాం. ఇప్పుడు, కాలా అజర్ వ్యాధి కూడా నిర్మూలించబడుతుంది. ఈ వ్యాధి ఇప్పుడు బీహార్, జార్ఖండ్ లోని 4 జిల్లాల్లో మాత్రమే ఉందని తెలిపారు.

Scroll to load tweet…

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ఆయనకు నివాళులర్పించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి విద్య, విదేశాంగ విధానం, మౌలిక సదుపాయాల రంగంతో సహా ప్రతి రంగంలో భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారని ఆయన అన్నారు.

Scroll to load tweet…

'స్వచ్ఛ్ భారత్ మిషన్' గురించి మాట్లాడుతూ.. "నమామి గంగే మిషన్ కూడా జీవవైవిధ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడింది. 'స్వచ్ఛ్ భారత్ మిషన్' ప్రతి భారతీయుడి మనస్సులో స్థిరంగా పాతుకుపోయింది, పరిశుభ్రత వారసత్వాన్ని ఇప్పుడు భారతీయులందరూ క‌లిసి ముదుకు తీసుకువెళుతున్నారు" అని అన్నారు. 

Scroll to load tweet…