Asianet News TeluguAsianet News Telugu

కరోనా టీకా: అమెరికా 101 రోజులు, చైనా 109 రోజులు.. 95 రోజుల్లోనే కొట్టేసిన ఇండియా

కరోనా వైరస్‌ టీకా పంపిణీలో భారత్‌ దూసుకెళ్తోంది. అగ్రరాజ్యాలకు సైతం సాధ్యం కానీ రీతిలో చాలా తక్కువ సమయంలోనే దేశ ప్రజలకు వ్యాక్సినేషన్ ఇస్తోంది. ఈ క్రమంలో మరో మైలు రాయిని అధిగమించింది. అత్యంత వేగంగా 95 రోజుల్లోనే 13 కోట్ల డోసుల పంపిణీని పూర్తి చేసి రికార్డు సృష్టించింది. 

india fastest country to administer 13 crore covid vaccine doses health ministry ksp
Author
New Delhi, First Published Apr 21, 2021, 3:13 PM IST

కరోనా వైరస్‌ టీకా పంపిణీలో భారత్‌ దూసుకెళ్తోంది. అగ్రరాజ్యాలకు సైతం సాధ్యం కానీ రీతిలో చాలా తక్కువ సమయంలోనే దేశ ప్రజలకు వ్యాక్సినేషన్ ఇస్తోంది. ఈ క్రమంలో మరో మైలు రాయిని అధిగమించింది.

అత్యంత వేగంగా 95 రోజుల్లోనే 13 కోట్ల డోసుల పంపిణీని పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. అగ్రరాజ్యం అమెరికా ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి 101 రోజులు పట్టగా.. చైనాలో 109 రోజులు సమయం పట్టినట్లు తెలిపింది.  

తాజా గణాంకాల ప్రకారం మంగళవారం ఇచ్చిన వాటితో కలిపి మొత్తం 13.01కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 8 రాష్ట్రాల్లో టీకా ప్రక్రియ 59.33 శాతంగా నమోదైందని.. అందులో మహారాష్ట్ర, రాజస్థాన్‌, యూపీ, గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, కేరళ ఉన్నాయని పేర్కొంది.

Also Read:మే నుండి18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్: కేంద్రం సంచలన నిర్ణయం

కాగా, గడిచిన 24 గంటల్లో 29.90 లక్షల డోసులు పంపిణీ చేశారు. మరోవైపు మే 1వ తేదీ నుండి  దేశంలో మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం ప్రారంభించనుంది. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయం తీసుకొంది.  

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకొంది.  వ్యాక్సిన్ వేసుకోవాలనే  వారంతా  కోవిన్  వెబ్‌సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాని  కేంద్రం సూచించింది.

వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించాలనే  ఉద్దేశ్యంతో  కేంద్రం ఈ నిర్ణయం తీసుకొంది.  కరోనా వ్యాక్సిన్  డోసులను నేరుగా ఫార్మా కంపెనీల నుండి సేకరించేందుకు ఆయా రాష్ట్రాలకు కేంద్రం అవకాశం కల్పించింది. ఈ మేరకు  సోమవారం నాడు ఉత్తర్వులు కూడ జారీ చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios