మే నుండి18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్: కేంద్రం సంచలన నిర్ణయం

ఈ ఏడాది మే 1వ తేదీ నుండి  18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి  కరోనా వ్యాక్సిన్ వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 

COVID19 vaccine for all above age of 18 years from May 1: Government lns

న్యూఢిల్లీ: ఈ ఏడాది మే 1వ తేదీ నుండి  18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి  కరోనా వ్యాక్సిన్ వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. దేశంలో కరోనా స్థితిగతులపై ప్రధాని మోడీ  డాక్టర్లు, ఫార్మా కంపెనీలతో ఇవాళ  వీడియో కాన్పరెన్స్ ద్వారా చర్చించారు. ఈ చర్చల తర్వాత  కేంద్రం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. 

మే 1వ తేదీ నుండి  దేశంలో మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం ప్రారంభించనుంది. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయం తీసుకొంది.  దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకొంది.  వ్యాక్సిన్ వేసుకోవాలనే  వారంతా  కోవిన్  వెబ్‌సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాని  కేంద్రం సూచించింది.

వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించాలనే  ఉద్దేశ్యంతో  కేంద్రం ఈ నిర్ణయం తీసుకొంది.  కరోనా వ్యాక్సిన్  డోసులను నేరుగా ఫార్మా కంపెనీల నుండి సేకరించేందుకు ఆయా రాష్ట్రాలకు కేంద్రం అవకాశం కల్పించింది. ఈ మేరకు  సోమవారం నాడు ఉత్తర్వులు కూడ జారీ చేసింది. 

వ్యాక్సిన్ ఉత్పత్తిని భారీగా పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది.  వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థలకు కేంద్రం రుణాలు అందించనుంది. సీరం సంస్థకు కేంద్రం రూ. 3 వేల కోట్ల రుణం అందించనుంది. నెలకు 7 కోట్ల వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తామని సీరం సంస్థ ప్రకటించింది.భారత్ బయోటెక్ కు  రూ. 1500 కోట్ల రుణం అందించనుంది కేంద్రం. ఈ ఏడాది చివరి నాటికి 70 కోట్ల వ్యాక్సిన్లు తయారు  చేస్తామని భారత్ బయోటెక్ ప్రకటించింది.ఉత్పత్తయ్యే వ్యాక్సిన్లలో 50 శాతం ఓపెన్ మార్కెట్లోకి అనుమతిచ్చింది కేంద్రం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios