దేశంలో కరోనా విజృంభణ: ఆరు లక్షలు దాటిన కేసులు, 17 వేలు దాటిన మరణాలు

24 గంటల్లో ఇండియాలో 18,653 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 6,04,641కి చేరుకొన్నాయి. ఇందులో 2,26,947 యాక్టివ్ కేసులు. ఇప్పటివరకు 3,59,860 మంది కరోనా నుండి కోలుకొన్నారు

India coronavirus, COVID-19 live updates, July 2: Rajasthan reports 115 new COVID-19 cases, total tally rises to 18427

న్యూఢిల్లీ: 24 గంటల్లో ఇండియాలో 18,653 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 6,04,641కి చేరుకొన్నాయి. ఇందులో 2,26,947 యాక్టివ్ కేసులు. ఇప్పటివరకు 3,59,860 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  కరోనా నుండి కోలుకొన్న రోగుల సంఖ్య 59.43 శాతానికి చేరుకొన్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.

also read:17,400 మంది మృతి: ఇండియాలో 5,85,493కి చేరిన కరోనా కేసులు

కరోనా వైరస్ తో ఇప్పటి వరకు దేశంలో 17,834 మంది మరణించినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.జూలై 1వ తేదీ వరకు దేశంలో 90,56,173 శాంపిల్స్ సేకరించారు. బుధవారం నాడు ఒక్క రోజే 2,29,538 శాంపిల్స్ ను పరీక్షల  కోసం తీసుకొన్నట్టుగా ఐసీఎంఆర్ ప్రకటించింది.

మహారాష్ట్రలో కరోనా కేసులు 1,80,298 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 5,537 కేసులు నమోదైనట్టుగా ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో 8,053 మంది మరణించారు. 24 గంటల్లో 198 మంది మరణించినట్టుగా ప్రభుత్వం తెలిపింది.

రాజస్థాన్ రాష్ట్రంలో 115 కొత్త కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో 18,427 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 426 మంది మరణించారు. జార్ఖండ్ రాష్ట్రంలో కొత్తగా 35 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,525కి చేరుకొన్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios