17,400 మంది మృతి: ఇండియాలో 5,85,493కి చేరిన కరోనా కేసులు

 దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో కరోనా కేసులు 5,85,493కి చేరుకొన్నాయి. వీటిలో 2,20,114 యాక్టివ్ కేసులుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

India coronavirus, COVID-19 live updates, July 1: India's COVID-19 cases tally rise to 585493 with 17400 deaths, recovery rate 59.43%

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో కరోనా కేసులు 5,85,493కి చేరుకొన్నాయి. వీటిలో 2,20,114 యాక్టివ్ కేసులుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

ఇప్పటివరకు 3,47,979 మంది కరోనా నుండి కోలుకొన్నారు. కరోనా సోకి దేశ వ్యాప్తంగా 17,400 మంది మృత్యువాత పడ్డారు. కరోనా సోకిన వారిలో 59.43 శాతం మంది కోలుకొంటున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

మంగళవారం నాడు ఒక్క రోజే ముంబైలో 36 మంది కరోనాతో మరణించారు. ముంబైలో 77,197 కరోనా కేసులు నమోదయ్యాయి.ఇందులో 28,473 యాక్టివ్ కేసులుగా బీఎంసీ ప్రకటించింది. ఇప్పటివరకు 44,170 మంది కరోనా నుండి కోలుకొన్నట్టుగా అధికారులు తెలిపారు. ముంబైలో జూన్ 30వ తేదీ నాటికి 4,554 మంది కరోనాతో మరణించారు.

ఢిల్లీలోని స్పెషల్ పోలీస్ సెల్ విభాగంలో సీఐగా పనిచేస్తున్న సంజీవ్ కుమార్ యాదవ్ కరోనాతో మంగళవారం నాడు మరణించినట్టుగా అధికారులు ప్రకటించారు. ఢిల్లీలోని సాకేట్ లోని మ్యాక్స్ ఆసుపత్రిలో ఆయన మరణించారు.  గత 14 రోజులుగా ఆయన వెంటిలేటర్ పై ఉన్నట్టుగా అధికారులు తెలిపారు.

also read:24 గంటల్లో 418 మంది మృతి: ఇండియాలో 5,66,840కి చేరిన కరోనా కేసులు

ఆయనకు రెండు దఫాలుగా ప్లాస్మా థెరపీ నిర్వహించారు. ఆయనకు ఈ ఏడాది జనవరిలో పోలీస్ మెడల్ గ్యాలంటరీ అవార్డు దక్కింది.
కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.జూలై 5వ తేదీ నుండి ఆగష్టు 2వ తేదీ వరకు  ఆదివారాల్లో కూడ సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్టుగా కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. 

మంగళవారం నాడు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగించారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని ఈ ఏడాది నవంబర్ వరకు కొనసాగిస్తామని ప్రధాని ప్రకటించారు.అంతేకాదు నవంబర్ మాసం వరకు పేదలకు ఉచితంగా రేషన్ ను అందిస్తామని ఆయన తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios