కోవిడ్‌పై (Covid) పోరును మరింత బలోపేతం దిశగా భారత ప్రభుత్వం సాగుతుంది. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (Central Drugs Standard Control Organisation) ఒకేసారి రెండు వ్యాక్సిన్‌లు మరియు ఒక యాంటీ వైరల్ డ్రగ్‌కు ఆమోదం తెలిపింది.
కోవిడ్‌పై పోరును మరింత బలోపేతం దిశగా భారత ప్రభుత్వం సాగుతుంది. ఇందులో భాగంగా ఒకేసారి రెండు కొత్త వ్యాక్సిన్లు, ఒక ఔషధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (Central Drugs Standard Control Organisation) ఒకేసారి రెండు వ్యాక్సిన్‌లు మరియు ఒక యాంటీ వైరల్ డ్రగ్‌కు ఆమోదం తెలిపింది. CORBEVAX, COVOVAX వ్యాక్సిన్లతో పాటుగా మోల్నుపిరవర్ ఔషధం అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేశంలో కరోనాపై పోరును మరింత బలోపేతం చేసేందుకు ఒకే రోజు రెండు టీకాలు, ఒక ఔషధానికి ఆమోదం తెలిపినట్టుగా పేర్కొన్నారు. అయితే వీటిని అత్యవసర వినియోగానికి మాత్రమే పరిమితంచేసినట్టుగా వెల్లడించారు.
కోర్బెవాక్స్ పేరుతో రూపొందించిన వ్యాక్సిన్ విషయానికి వస్తే దీనిని దేశీయంగా అభివృద్ది చేశారు. హైదరాబాద్‌కు చెందిన ర్మా కంపెనీ ‘బయలాజికల్ ఈ’ ఈ వ్యాక్సిన్‌ను తీసుకొచ్చింది. ఇది భారతదేశంలో అభివృద్ది చేయబడిన మూడో వ్యాక్సిన్ అని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ఇక, కోవో వ్యాక్స్ టీకాను పుణే కేంద్రంగా ఉన్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ది చేసినట్టుగా వెల్లడించారు. మోల్నుపిరవర్ యాంటీవైరల్ డ్రగ్‌ను దేశంలోని 13 కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయని మంత్రి వెల్లడించారు. కోవిడ్ బాధపడుతున్న అడల్డ్ పెషేంట్లకు, ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికి అత్యవసర పరిస్థితుల్లో చికిత్స చేయడానికి దీనిని వినియోగించనున్నట్టుగా చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ కోవిడ్‌పై పోరుకు ముందుండి నాయకత్వం వహిస్తున్నారని మంత్రి మన్సుఖ్ మాండవియా అన్నారు. ప్రస్తుతం లభించిన ఆమోదాలు.. కోవిడ్‌పై పోరును మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. భారత ఫార్మా పరిశ్రమలు ప్రపంచానికే ఆస్తి అని పేర్కొన్నారు.
