Asianet News TeluguAsianet News Telugu

స్వతంత్ర భారతంలో 12వ తరగతి మాత్రమే పాసైన ప్రధాని ఇప్పటి వరకు లేరు - అరవింద్ కేజ్రీవాల్

స్వతంత్ర భారతదేశ చరిత్రను పరిశీలిస్తే కేవలం 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన ప్రధాని మనకు ఎప్పుడూ లేరని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశాన్ని రక్షించాలనుకునేవారు బీజేపీ నుంచి బయటకు రావాలని ఆయన సూచించారు. 
 

Independent India has never had a Prime Minister who passed only 12th standard - Arvind Kejriwal.. ISR
Author
First Published Mar 25, 2023, 4:45 PM IST

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం నాశనమవుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో కేవలం 12వ తరగతే పాసైన ప్రధాని దేశానికి ఎప్పుడూ లేరని విమర్శించారు. ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని నడపలేరని, కానీ ఆయనకు అహం అగ్రస్థానంలో ఉందని ఆరోపించారు.

బెంగళూరులో కొత్త మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

‘‘ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం నాశనమవుతోందని బీజేపీ నేతలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దేశాన్ని నాశనం చేయాలనుకునే వారు బీజేపీలోనే ఉంటారు. దేశాన్ని రక్షించాలనుకునే వారు ఈరోజు బీజేపీని వీడాలి.’’ అని అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ‘మోడీ ఇంటిపేరు’ వ్యాఖ్యలపై 2019లో జరిగిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చిడం వల్ల ఆయన లోక్ సభ సభ్యుడిగా అనర్హత వేటు పడింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ కనుసన్నల్లోనే ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందని, దేశాన్ని కాపాడేందుకు ప్రజలు ముందుకు రావాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

ఇప్పుడు ఈ అప్రజాస్వామిక పాలనపై పోరాడాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఆయన అన్నారు. దేశాన్ని కాపాడుకోవాలంటే 130 కోట్ల మంది భారత ప్రజలు ముందడుగు వేయాలని కోరారు. ‘‘ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఫర్వాలేదు. మన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది’’ అని కేజ్రీవాల్ అన్నారు.

క్షమాపణలు చెప్పుంటే ఇంత దూరం వచ్చేదా.. మధ్యలో అదానీకేం సంబంధం : రాహుల్‌కు బీజేపీ కౌంటర్

పరువునష్టం కేసులో కాంగ్రెస్ దోషిగా తేలిన 24 గంటల్లోనే లోక్‌సభ సభ్యత్వం రద్దు చేసిన తీరు దేశానికి ఆందోళన కలిగిస్తోందని కేజ్రీవాల్ అన్నారు. తాను న్యాయవ్యవస్థను ఎంతో గౌరవిస్తానని, అయితే ఈ విషయంలో సెషన్స్ కోర్టు నిర్ణయాన్ని సమర్థించబోనని ఢిల్లీ సీఎం అన్నారు. రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని బీజేపీ రద్దు చేసిన తీరు భయాందోళనకు గురిచేస్తోందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పాలన సాగిస్తోందని, మిగతా రాజకీయ పార్టీలన్నింటినీ తుదముట్టించడమే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios