నోయిడాలో దారుణం జరిగింది. వీధి కుక్కల దాడిలో ఓ పసికందు చనిపోయింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు, ఆ కాలనీ వాసులు పెద్ద ఎత్తున ఆందోళన తెలిపారు. రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. 

నోయిడా సిటీలోని లోటస్ బౌలేవార్డ్ వద్ద సోమవారం ఓ పసికందుపై వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో ఆ పాపకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆ పాప చనిపోయింది. దీంతో ఆ సిటీలో విహరిస్తున్న వీధి కుక్కల సమస్యకు పరిష్కారం చూపాలని నిరసనలు ప్రారంభమయ్యాయి. 

యూపీలొ మరో నిర్భయ ఘటన.. రెండు రోజులపాటు గ్యాంగ్ రేప్.. ఇనుప రాడ్ తో..

వివరాలు ఇలా ఉన్నాయి. రాజేష్ కుమార్, సప్నా దంపతులకు ఏడు నెలల వయస్సున్న అరవింద్ అనే కుమారుడు ఉన్నారు. సోమవారం సప్నా తన భర్తకు మధ్యాహ్న భోజనం అందించడానికి కుమారుడిని తీసుకొని సెక్టార్ 100 సొసైటీకి వచ్చింది. భర్తకు భోజనం ఇవ్వడానికి ఆ ప్రాంతంలోని ఓ బల్లపై బిడ్డను పడుకోబెట్టి వెళ్లింది. రాజేష్ కుమార్ భోజనం చేస్తుండగా... ఆ ప్రాంతంలో రెండు మూడు కుక్కలు గోడవ పడుతూ బాలుడి దగ్గరకు వచ్చాయి. ఈ సమయంలో బాలుడిని విచ్చలవిడిగా దాడి చేశాయి. 

తల్లిదండ్రులు బాలుడిని విడిపించి సెక్టార్ 110లోని యథార్త్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి రాత్రి చనిపోయాడు.. దీంతో మంగళవారం ఉదయం 8 గంటలకు ఏవోఏ, నోయిడా అథారిటీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రోడ్ ను బ్లాక్ చేశారు. ఈ ఆందోళన కు నోయిడా అథారిటీ స్పందించింది. వెంటనే డాగ్ క్యాచర్ల బృందాన్ని స్పాట్ కు పంపించారు.

కూతురు వేరేకులం వ్యక్తిని ప్రేమించిందని.. దారుణంగా ఇద్దరినీ హత్య చేసి, నగ్నంగా నదిలో పడేసి.. ఓ తండ్రి ఘాతుకం..

దీంతో కొంత మంది జంతు హక్కుల వచ్చి దానిని అడ్డుకున్నారు. తీవ్రంగా ప్రతిఘటించారు. చివరికి కాంపౌండ్ పై ఉన్న సుమారు 10 వీధికుక్కలను పట్టుకుట్టుని సెక్టార్ 94లోని జంతు సంరక్షణ కేంద్రానికి పంపారు. ఈ సమయంలో అక్కడ శాంతిభద్రతల పరిరక్షణ కోసం సొసైటీ వద్ద భద్రతా సిబ్బందిని కూడా నియమించామని ఓ పోలీసు అధికారి తెలిపారు.

‘‘కూతురును బాగా చూసుకో.. ’’ కంటతడి పెట్టిస్తున్న పైలట్ అనిల్ సింగ్ చివరి మాటలు..

ఈ ఘటనపై లోటస్ బౌలేవార్డ్ అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ (LBAOA) వైస్ ప్రెసిడెంట్ డీవీ యాదవ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో వీధి కుక్కల భయం ఎక్కువగా ఉందని అన్నారు. ఈ కుక్కల వల్ల ఒక చిన్నారి ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా అనేక దాడులు జరిగాయని చెప్పారు. వాటిని స్టెరిస్టెలైజ్ చేయాలని, ఈ ప్రాంతం నుంచి కుక్కలను తొలగించాలని నోయిడా అథారిటీకి చాలాసార్లు లేఖలు పంపామని చెప్పారు. పిల్లలు ధైర్యంగా ఆడుకోలేకపోతున్నారని తెలిపారు. కాగా.. ఈ వ్యవహారంపై మంగళవారం జనరల్ డైరీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.