వైద్యులకు అండగా ఉంటాం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
కరోనా వైరస్ సోకిన రోగులకు సేవలు అందిస్తున్న వైద్యులకు భద్రత కల్పిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. బుధవారంనాడు ఐఎంఏ ప్రతినిధులతో అమిత్ షా సమావేశమయ్యారు.
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సోకిన రోగులకు సేవలు అందిస్తున్న వైద్యులకు భద్రత కల్పిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. బుధవారంనాడు ఐఎంఏ ప్రతినిధులతో అమిత్ షా సమావేశమయ్యారు.
కరోనా వైరస్ సోకిన రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, ఆసుపత్రులపై దాడులను ఆపకపోతే ఈ నెల 23న బ్లాక్ డే నిర్వహిస్తామని ఐఎంఏ మంగళవారం నాడు హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో ప్రముఖ వైద్యులు, ఐఎంఏ ప్రతినిధులతో అమిత్ షా, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సమావేశమయ్యారు.
also read:వైద్యులు, ఆసుపత్రులపై దాడులు ఆపకపోతే ఈ నెల 23న బ్లాక్ డే:ఐఎంఏ వార్నింగ్
వీడియో కాన్పరెన్స్ ద్వారా మంత్రులు ఐఎంఏ ప్రతినిధులతో మాట్లాడారు. వైద్యులకు ప్రభుత్వం మద్దతుగా ఉన్న విషయాన్ని కేంద్రం గుర్తు చేసింది.ఈ సమయంలో ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయకూడదని అమిత్ షా ఐఎంఏ ప్రతినిధులను కోరారు.
also read:42 రోజులుగా ఆసుపత్రిలోనే: 19 సార్లు 62 ఏళ్ల మహిళకు కరోనా
అద్దె ఇళ్లలో ఉంటున్న కొందరు వైద్యులపై యజమానులు వేధింపులకు దిగుతున్నారు. అలాగే కరోనా రెడ్ జోన్లలో సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిపై కూడా పోకిరిలు దాడులకు తెగబడుతున్న విషయాన్ని వైద్యులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.