42 రోజులుగా ఆసుపత్రిలోనే: 19 సార్లు 62 ఏళ్ల మహిళకు పాజిటివ్

కేరళ రాష్ట్రంలోని 62 ఏళ్ల మహిళకు 19 దఫాలు కరోనా  పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఎలాంటి కరోనా లక్షణాలు లేకుండానే ఆమెకు కరోనా సోకిందని వైద్యులు ప్రకటించారు. ఆ మహిళ 42 రోజులుగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది.

Kerala woman tests positive 19 times after 42 days in hospital


తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని 62 ఏళ్ల మహిళకు 19 దఫాలు కరోనా  పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఎలాంటి కరోనా లక్షణాలు లేకుండానే ఆమెకు కరోనా సోకిందని వైద్యులు ప్రకటించారు. ఆ మహిళ 42 రోజులుగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది.

ఇటలీకి వెళ్లి వచ్చిన కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడంతో ఆమెకు కరోనా సోకింది. ఆమె కుటుంబసభ్యులు ఫిబ్రవరి మాసంలో ఇటలీ నుండి తిరిగి వచ్చారు. అయితే ఆమెకు కరోనా లక్షణాలు కన్పించలేదు. దీంతో ఆమె అనేక కార్యక్రమాలకు హాజరయ్యారు.

అయితే మార్చి 10వ తేదీన  ఈ కుటుంబాన్ని క్వారంటైన్ కు తరలించారు. వీరిలో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరంతా కోలుకొంటున్నారు. ఈ కుటుంబంలోని ముగ్గురు ఫిబ్రవరి 29వ తేదీ నుండి మూడు వారాల పాటు రాష్ట్రంలోని రన్ని ప్రాంతానికి వెళ్లి పలు ఫంక్షన్లలో పాల్గొన్నారు.వీరి నుండి పలువురికి ఈ వైరస్ వ్యాప్తి చెందిందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

also read:ఇండియాలో 20 వేలకు చేరువలో కరోనా కేసులు: మొత్తం 640 మంది మృతి

62 ఏళ్ల మహిళకు ఎలాంటి లక్షణాలు కన్పించకుండానే వైరస్ సోకిన విషయాన్ని క్వారంటైన్ లో ఉన్న సమయంలో వైద్యులు గుర్తించారు. ఇప్పటివరకు ఆమెలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. కాంబినేషన్ డ్రగ్స్ చాలా సార్లు ఆమెకు ఇచ్చామని వైద్యులు చెప్పారు. అయినా కూడ పరిస్థితిలో మార్పు లేదని పతనంమిట్ట జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎన్.షీజా చెప్పారు.

కరోనా రోగులకు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. కేరళలో మాత్రం 28 రోజుల పాటు ఇంక్యుబేషన్ వ్యవధిని పొడిగించింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios