వైద్యులు, ఆసుపత్రులపై దాడులు ఆపకపోతే ఈ నెల 23న బ్లాక్ డే:ఐఎంఏ వార్నింగ్

వైద్యులపై, ఆసుపత్రులపై దాడులను ఆపడంలో విఫలమైతే  ఈ నెల 23 వ తేదీన బ్లాక్ డే నిర్వహిస్తామని ఐఎంఏ ప్రకటించింది.కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న సమయంలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు చోటు చేసుకొన్నాయి.

IMA Warns Of 'Black Day' On Apr 23 If Govt Fails To Enact On Violence Against Doctors

న్యూఢిల్లీ:వైద్యులపై, ఆసుపత్రులపై దాడులను ఆపడంలో విఫలమైతే  ఈ నెల 23 వ తేదీన బ్లాక్ డే నిర్వహిస్తామని ఐఎంఏ ప్రకటించింది.కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న సమయంలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు చోటు చేసుకొన్నాయి.

తెలంగాణ, యూపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడ ఈ రకమైన దాడులు జరిగాయి. ఈ విషయాన్ని కేంద్రంతో పాటు  ఆయా రాష్ట్రాలు కూడ సీరియస్ గా తీసుకొన్నాయి. వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిపై కేసులు కూడ పెట్టారు.

also read:కేంద్రం ఆగ్రహం: లాక్‌డౌన్ నిబంధనల సడలింపు ఉత్తర్వులు వెనక్కి తీసుకొన్న కేరళ

పనిచేస్తున్న ప్రాంతాల్లో రక్షణ కల్పించడంతో పాటు అవసరమైన రక్షిత పరికరాలను ఇవ్వాలని ఐఎంఏ ప్రభుత్వాలను కోరింది. డాక్టర్లపై, వైద్య సిబ్బందిపై దాడులను ఆపాలని విన్నవించింది.

దాడులను నిరసిస్తూ ఈ నెల 22వ తేదీ రాత్రి 9 గంటలకు వైద్యులు, ఆసుపత్రుల నిర్వాహకులు క్యాండిల్ నిర్వహించనున్నట్టుగా ఐఎంఏ ప్రకటించింది.

వైద్యులపై, వైద్య సిబ్బందిపై దాడులను ఆపకపోతే ఈ నెల 23వ తేదీన బ్లాక్ డే నిర్వహిస్తామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఆ రోజున వైద్యులంతా నల్ల బ్యాడ్జీలతో హాజరౌతారని ఐఎంఏ పేర్కొంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios