అధికార దాహంతో బీజేపీ దేశ ఆత్మగౌరవంతో ఆడుకుంటోంది.. : రాహుల్ గాంధీ
New Delhi: అధికార దాహంతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మహిళల గౌరవంతో ఆడుకుంటోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. లైంగిక దాడుల ఘటనలకు సంబంధించిన మీడియా కథనాలతో రూపొందించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Congress leader Rahul Gandhi: అధికార దాహంతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మహిళల గౌరవంతో ఆడుకుంటోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. లైంగిక దాడుల ఘటనలకు సంబంధించిన మీడియా కథనాలతో రూపొందించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వివరాల్లోకెళ్తే.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోడీ నాయకత్వంలోని బీజేపీ సర్కారును టార్గెట్ చేశారు. తీవ్ర విమర్శలు గుప్పిస్తూ విరుచుకుపడ్డారు. అధికార దాహంతో బీజేపీ మహిళల గౌరవంతో పాటు దేశ ఆత్మగౌరవంతో ఆడుకుంటోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై దాడి చేసేందుకు లైంగిక దాడుల ఘటనలపై మీడియా కథనాలతో రూపొందించిన వీడియోను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా చేసి ఊరేగించిన లైంగిక దాడి ఘటన, డబ్ల్యూఎఫ్ ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు, ఉత్తరాఖండ్ లో బీజేపీ నేత కుమారుడిపై ఆరోపణల నేపథ్యంలో బాధితురాలి హత్య, బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో దోషులను విడుదల చేయడం వంటి ఘటనలను ఈ వీడియోలో ప్రస్తావించారు. ''మహిళలను గౌరవించని దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. అధికార దాహంతో బీజేపీ మహిళల గౌరవంతో పాటు దేశ ఆత్మగౌరవంతో ఆడుకుంటోంది'' అని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పోస్టులో పేర్కొన్నారు.
మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నం చేసి నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల ప్రారంభంలోనే వెలుగులోకి వచ్చిన మే 4 ఘటనకు సంబంధించిన వీడియో దేశవ్యాప్తంగా దుమారం రేపగా, ఆ తర్వాత అధికార బీజేపీ, ప్రతిపక్ష కూటమి మధ్య మాటల యుద్ధానికి కేంద్ర బిందువుగా మారింది.