బడిని బాగు చేయాలని ప్రధానిని వీడియోలో కోరిన బాలిక.. కదిలిన జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం.. పునరుద్దరణ పనులు షురూ..

తమ పాఠశాలలో సౌకర్యాలు మెరుగుపర్చాలని ప్రధానిని కోరుతూ జమ్మూ కాశ్మీర్ కు చెందిన మూడో తరగతి బాలిక విడుదల చేసిన వీడియో కు స్పందన వచ్చింది. జమ్మూ కాశ్మీర్ అధికారులు ఆ పాఠశాలను సందర్శించారు. పునరుద్దరణ పనులు మొదలు పెట్టారు. 

In a video, the girl asked the Prime Minister to repair the school. The shaken Jammu and Kashmir administration.. Reconciliation work has started..ISR

తమ పాఠశాలలో ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని ప్రధాని మోడీని కోరుతూ జమ్మూ కాశ్మీర్ లోని కథువా జిల్లాకు చెందిన మూడో తరగతి విద్యార్థి సీరత్ నాజ్ చేసిన వీడియో ఇటీవల వైరల్ గా మారింది. తమ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆ బాలిక వీడియో ప్రధానికి విజ్ఞప్తి చేశారు. దీంతో జమ్మూ కాశ్మీర్ అధికార యంత్రాంగం కదిలింది. ఆ పాఠశాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు, పునరుద్ధరణ పనులు ప్రారంభించింది. జమ్మూలోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రవిశంకర్ శర్మ రిమోట్ లోహై-మల్హర్ బ్లాక్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు.

సల్మాన్ ఖాన్ కు మళ్లీ హత్యా బెదిరింపులు.. ఈ సారి రాఖీ సావంత్ కు కూడా... ‘దూరంగా ఉండండి’ అంటూ మెయిల్..

గత వారం ప్రధానమంత్రికి సీరత్ నాజ్ విజ్ఞప్తి చేస్తూ రూపొందించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యింది. అందులో ‘‘అస్సలాము అలైకుమ్ మోదీజీ. కైసే హో ఆప్... ఆప్ సబ్ కీ బాత్ సుంటే హో, మేరీ భీ బాత్ సునో ( నమస్కారం మోడీజీ. మీరు ఎలా ఉన్నారు? మీరు అందరూ చెప్పే మాట వింటారు. దయచేసి నా మాట కూడా వినండి) అని అన్నారు. నాలుగు నిమిషాలు ఉన్న ఈ వీడియోలో తన బడిలో ఉన్న సమస్యలను ప్రస్తావించింది.

అతిక్, అష్రఫ్ హత్య కేసు.. ముగ్గురు షూటర్లకు 4 రోజుల కస్టడీ విధించిన ప్రయాగ్ రాజ్ కోర్టు

వీడియో క్లిప్‌ను గమనించిన జమ్మూ కాశ్మీర్ అధికార యంత్రాంగం వెంటనే పాఠశాలకు ఫేస్‌లిఫ్ట్ ఇవ్వడానికి చర్యలు చేపట్టింది. పాఠశాలను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రవిశంకర్ శర్మ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ పాఠశాలను ఆధునిక పద్ధతిలో అప్‌గ్రేడ్ చేసేందుకు రూ.91 లక్షలతో ప్రాజెక్టు గతంలోనే మంజూరయ్యిందని, అయితే అడ్మినిస్ట్రేటివ్ అనుమతులకు సంబంధించిన కొన్ని సమస్యల కారణంగా పనులు నిలిచిపోయాయని చెప్పారు. ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం అయ్యిందని, పనులు మళ్లీ మొదలయ్యాయని చెప్పారు.

విచిత్రం..చనిపోయాడని చెప్పిన డాక్టర్లు..పోస్టుమార్టం చేసేందుకు సిద్ధమవుతుండగా మార్చురీలో కాళ్లు ఊపుతూ, సజీవంగా

కేంద్రపాలిత ప్రాంతంలోని మారుమూల ప్రాంతాల్లో వందలాది పాఠశాలలు నడుస్తున్నాయని ఆయన తెలిపారు. వాటిల్లో సరైన, ఆధునిక సౌకర్యాలను నిర్ధారించడానికి ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర ప్రణాళికను రూపొందించిందని అన్నారు. జమ్మూ ప్రావిన్స్‌లోని అన్ని జిల్లాల్లో 1,000 కొత్త కిండర్ గార్టెన్‌ల నిర్మాణాన్ని కూడా ప్రారంభించామని అన్నారు. వచ్చే మూడు, నాలుగేళ్లలో 10 జిల్లాల్లో 250 కిండర్ గార్టెన్‌ల నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.. యూటీ క్యాపెక్స్, డిస్ట్రిక్ట్ క్యాపెక్స్, ఓవరాల్ కింద స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగుపరచడానికి మూడు రకాల నిధులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటి కింద 2018 నుంచి 2,500 ప్రాజెక్టులు పూర్తయ్యాయని, ఇంకా 6,000 ప్రోగ్రెస్‌లో ఉన్నాయని చెప్పారు. 

ఎమ్మెల్యే కాన్వాయ్ పై మావోయిస్టుల దాడి.. ఆకస్మిక కాల్పులు.. ఎక్కడంటే ?

కాగా.. పాఠశాలలో పునరుద్దరణ పనులు ప్రారంభమైన నేపథ్యంలో సీరత్ నాజ్ మరో వీడియో విడుదల చేసింది. ‘‘మోడీ సార్ నమస్కారం. మీరు ఎలా ఉన్నారు. నేను బాగుననాను. మీ వల్ల మా స్కూల్ పనులు మొదలయ్యాయి. మా స్కూల్ ను కొత్తగా చేస్తున్నారు. దానికి మీకు నేను దన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నాను. ధన్యవాదాలు మోడీ సార్. మాకు డెస్క్‌లు, బెంచీలు కూడా వచ్చినప్పుడు నేను మళ్ళీ పెద్ద థ్యాంక్స్ చెబుతాను. ఇకపై నేను గోనెపట్టపై కూర్చోవాల్సిన అవసరం లేదు. మా భవనం కూడా పూర్తవుతుంది. అప్పుడు నేను మీకు ఇంకా కృతజ్ఞతలు తెలుపుతాను. బై సర్, లవ్ యూ!’’ అని తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios