వెంటనే మసీదులు ఖాళీ చేయండి.. లేకపోతే - బీజేపీ నేత ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు..
కర్ణాటక (karnataka) బీజేపీ (bjp) సీనియర్ నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం కేఎస్ ఈశ్వరప్ప (KS Eshwarappa) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో దేవాలయాల (temples)ను కూల్చేసి నిర్మించిన మసీదులను (mosques) వెంటనే కూల్చేయాలని అన్నారు. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
బీజేపీ సీనియర్ నేత, కర్నాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆలయాలను కూల్చేసి నిర్మించిన మసీదులను వెంటనే ఖాళీ చేయాలని ముస్లిం కోరారు. లేకపోతే ఏం జరుగుతుందో తనకు తెలియదని అన్నారు. స్వచ్ఛందంగా మసీదులను ఖాళీ చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.
బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు... 11మందికి క్షమాభిక్ష రద్దు..
కర్ణాటకలోని బెళగావిలో ఆదివారం నిర్వహించిన హిందూ కార్యకర్తల సదస్సులో ఈశ్వరప్ప పాల్గొని మాట్లాడారు. మథుర సహా మరో రెండు ప్రాంతాలు తమ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. కోర్టు తీర్పు వచ్చాక నేడు అయినా, రేపు అయినా ఆలయాల నిర్మాణం చేపడతామని చెప్పారు. అందులో ఎలాంటి సందేహమూ అక్కర్లేదని అన్నారు.
‘‘ఏ ఏ ప్రాంతంలో మసీదులు నిర్మించారో, వాటిని స్వచ్ఛందంగా ఖాళీ చేస్తేనే మీకు మంచిది. లేకపోతే ఎంతమంది చనిపోతారో, ఏం జరుగుతుందో మాకు తెలియదు’’ అని కేఎస్ ఈశ్వరప్ప వ్యాఖ్యానించారు. కాగా.. బీజేపీ సీనియర్ నేతగా ఉన్న ఆయన.. ఇలాంటి మతపరమైన వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు.. గతంలో కూడా ఆయన ఇలాంటి వివాదాలను రేకెత్తించారు.
కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిగితే ఫలితం ఉండదు - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
2023 డిసెంబర్ లో ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశంలో ఆలయాలను కూల్చేసి నిర్మించిన ఏ ఒక్క మసీదును కూడా వదిలిపెట్టబోమని ప్రకటించి వార్తల్లో నిలిచారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. అంతకు ముందు ఓ సారి మీడియాతో మాట్లాడుతూ.. భారత్ హిందూ దేశంగా మారుతుందని ప్రతిజ్ఞ చేసి చెబుతానని తెలిపారు.
గతేడాది జనవరి 22న ప్రపంచమంతా అయోధ్య వైపు చూస్తుందని అన్నారు. ‘‘కాశీ విశ్వనాథ ఆలయం విషయంలో కోర్టు విచారణ హిందువులకు అనుకూలంగా ఉంది. మథురలోని కృష్ణ ఆలయానికి సర్వేకు ఉత్తర్వులు మంజూరయ్యాయి. ప్రతిదీ ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతుంది’’ అని ఆయన చెప్పారు.