చంద్రయాన్ 3 ప్రయోగం ముగిసిన వెంటనే ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌కి ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాఫ్రికా నుంచి ఫోన్ చేసి అభినందించారు. 15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని జోహన్నెస్‌బర్గ్‌లో ఉన్నారు. ఆయన అక్కడ నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ క్షణాన్ని ఆస్వాదించారు.

చంద్రుడిపై భారత జెండా ఎగిరింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మిషన్ చంద్రయాన్-3 బుధవారం సాయంత్రం 6:04 గంటలకు చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ అయింది. ఫలితంగా, చంద్రుని దక్షిణ ధ్రువంపై తన అంతరిక్ష నౌకను దింపిన మొదటి దేశంగా ఇండియా అవతరించింది. యావత్ ప్రపంచం దృష్టి ఈ అంతరిక్ష యాత్రపై పడింది. ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా నుంచి మిషన్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. 15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని జోహన్నెస్‌బర్గ్‌లో ఉన్నారు. ఆయన అక్కడ నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ క్షణాన్ని ఆస్వాదించారు. ఇస్రో విజయంపై ఆయన మాట్లాడుతూ, మెరుగైన భారత్‌కు ఇదే తరుణం అని అన్నారు.

చంద్రయాన్ విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత దక్షిణాఫ్రికా నుంచి నేరుగా ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్‌కు మోదీ ఫోన్ చేశారు. 'నీ పేరు సోమనాథ్, నీ పేరు చంద్రుడితో ముడిపడి ఉంది. మీరు విజయం సాధిస్తారు. ఈ ప్రయాణంలో మీ ప్రతి భాగస్వామికి శుభాకాంక్షలు. మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ అభినందనలు , మీరు చరిత్ర సృష్టించారు. ' అని ప్రధాని వ్యాఖ్యానించారు. 

Scroll to load tweet…

చంద్రయాన్ 3 మిషన్ విజయవంతమైన సందర్భంగా ఆయన ఇస్రో శాస్త్రవేత్తలను, జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ప్రతి భారతీయ పౌరుడి మాదిరిగానే నేను కూడా చంద్రయాన్‌పై దృష్టి సారించానని ప్రధాని అన్నారు. తాను, నా దేశస్థులు, నా కుటుంబ సభ్యులు కూడా ఉత్సాహంగా వున్నారని ప్రధాని మోడీ తెలిపారు. ఇప్పటి వరకు ఏ దేశం చేరుకోని చంద్రుని దక్షిణ ధృవానికి భారత్ చేరుకుందని.. చంద్రుడికి సంబంధించిన అనేక అపోహలు నేటి నుంచి మారనున్నాయని మోడీ వ్యాఖ్యానించారు. 

ఈ క్షణాలు ఉద్విగ్నమైనవని, అపూర్వమైనవని, అద్భుతమైన క్షణాలని ప్రధాని మోడీ అన్నారు. ఈ విజయం 140 కోట్ల భారత ప్రజల హృదయ స్పందనలు అని వివరించారు. ఈ విజయం కొత్త శక్తి, కొత్త విశ్వాసాన్ని, కొత్త చైతన్యానికి ప్రతీక అని చెప్పారు. అమృతకాలపు తొలి ఫలితాల పరంపర మొదలైందని తెలిపారు. మన సంకల్పాన్ని చంద్రుడిపై సాకారం చేసుకున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు భారత్ చంద్రుడిపై ఉన్నదని వివరించారు. అంతరిక్షంలో కొత్త భారత దేశ కొత్త ప్రతీకను నిలిపారని పేర్కొన్నారు.

ALso Read: కాలర్ ఎగరేసిన ఇస్రో .. చంద్రుడిపై పాదం మోపిన విక్రమ్, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారత్

తామను బ్రిక్స్ సమ్మిట్ కోసం దక్షిణాఫ్రికాలో ఉన్నానని, కానీ, దేశంలోని ప్రతి పౌరుడి తరహాల తన మనస్సులోనూ మొత్తం చంద్రయాన్ 3 గురించిన ఆసక్తే ఉన్నదని వివరించారు. దేశం కొత్త చరిత్ర లిఖించడంలో కొత్త అధ్యాయం మొదలైందని తెలిపారు. దేశమంతా ఉత్సవం ప్రారంభమైందని చెప్పారు. ఇది వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ అనే తమ నినాదానికి నిదర్శనం అని వివరించారు. 

ఈ విజయం కేవలం భారత్‌కు పరిమితం కాదని, ప్రపంచ మానవాళి విజయంగా దీన్ని చూడాలని ప్రధాని మోడీ చెప్పారు. ఇది హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్ అని ప్రధాని మోడీ చెప్పారు. ఈ విజయం మొత్తం మానవాళికి చెందిన దని వివరించారు. ఈ విజయంతో ఇతర దేశాల కూ లబ్ది చేకూరుతుందని, ఇతర దేశాలకూ తాము సహకరిస్తామని చెప్పారు.