Asianet News TeluguAsianet News Telugu

సహజీవనం చేస్తున్న మహిళ ముఖం చిధ్రం చేసి, గొంతుకోసి చంపిన వ్యక్తి.. చిటికెన వేలు నరికి..

ఓ వ్యక్తి తాను సహజీవనం చేస్తున్న మహిళ మొహాన్ని చిధ్రం చేశాడు. అతి దారుణంగా ఆమె గొంతుకోసి హత్య చేశాడు. 

Man slashes slits throat to live-in partner in west Delhi
Author
First Published Dec 3, 2022, 9:52 AM IST

న్యూఢిల్లీ : ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ కేసు మరువకముందే.. అలాంటి మరోఘటన వెలుగు చూసింది. ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్‌ కి మరో కేసు సవాల్ గా మారింది. ఒక వ్యక్తి తను సహజీవనం చేస్తున్న మహిళను అత్యంత దారుణంగా హతమార్చాడు. మొహం మీద డజనుకు పైగా కత్తితో కోసి.. ఆ తరువాత చాపర్ తో గొంతుకోసి, తలను వేరుచేసి చంపేశాడు. గాయాల వల్ల ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారి, దీంతో తీవ్రరక్తస్రావమై మరణించాక.. ఆమె గొంతును కొసేశాడు. 

గురువారం 35 ఏళ్ల రేఖ అనే ఆ మహిళను అతి దారుణంగా ఆమె సహజీవంనం చేస్తున్న భాగస్వామి మన్‌ప్రీత్ సింగ్ (45) హత్య చేశారు. ఆ తరువాత ఆమె ఉంగరపు వేలును కత్తిరించాడు. రేఖ 16 ఏళ్ల కుమార్తెకు కూడా మత్తుమందు ఇచ్చి శుక్రవారం ఉదయం పంజాబ్‌కు పారిపోయాడు. విషయం వెలుగులోకి రావడంతో పాటియాలాలోని అతని స్వగ్రామంలో అతడిని అరెస్టు చేశారు. రేఖ కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ దాఖలయ్యింది. అందులో ఆమె ఘటనకు సంబంధించిన వివరాలను ఇలా చెప్పుకొచ్చింది. “గురువారం ఉదయం 6 గంటలకు నేను నిద్ర లేచేసరికి.. మన్‌ప్రీత్ అంకుల్ నాకు మైగ్రేన్ కోసం కొన్ని టాబ్లెట్స్ ఇచ్చాడు. అవి వేసుకుని పడుకోమని చెప్పాడు. 

కొంతసేపటి తరువాత నాకు అనుమానం వచ్చింది. మా అమ్మ గురించి అడిగాను. ఆమె మార్కెట్‌కి వెళ్లిందని చెప్పాడు. ఆ తరువాత సింగ్ తన ఐ20 కారులో వెళ్లిపోయాడు. అతను వెళ్లిపోయిన తర్వాత నేను మా బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పాను. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు’ అని చెప్పింది. ఫిర్యాదు మేరకు పోలీసులు వారి ఇంటికి చేరుకుని మూసిఉన్న ఓ గది తలుపులు పగులగొట్టి తెరిచి చూడగా, రేఖ ముఖం, మెడపై అనేక గాయాలతో చనిపోయి ఉంది. ఆమె కుడి ఉంగరపు వేలు కత్తిరించి ఉంది.

ఆ బిచ్చగాడు ఐదు కోట్లకు అధిపతి.. కానీ రోడ్లమీద బిచ్చం ఎత్తుకుంటూ.. ఫుట్ పాత్ పై జీవిస్తూ..

సింగ్ మొబైల్ ఫోన్ లొకేషన్‌ల ఆధారంగా టోల్ ప్లాజాల దగ్గరున్న డజన్ల కొద్దీ సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పోలీసులు స్కాన్ చేశారు. స్పెషల్ కమిషనర్ (క్రైమ్) రవీంద్ర యాదవ్ ప్రకారం, నేరం జరిగిన 24 గంటల్లో నిందితుడిని అతని గ్రామంలో పట్టుకున్నారు. "నిందితుడికి క్రిమినల్ రికార్డ్ ఉంది. కిడ్నాప్ చేయడం, హత్యాయత్నం, ఆయుధాల చట్టంతో సహా ఆరు క్రూరమైన కేసులలో ప్రమేయం ఉంది. డీసీపీ రోహిత్‌ మీనా, ఏసీపీ యశ్‌పాల్‌, ఇన్‌స్పెక్టర్‌ సునీల్‌ కుమార్‌తో కూడిన ప్రత్యేక బృందం అతడిని వెతికి పట్టుకుంది’’ అని యాదవ్ చెప్పారు.

తన తండ్రి అమెరికాలో ఉంటున్నాడని, తాను పాటియాలా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశానని సింగ్ పోలీసులకు చెప్పాడు. సెకండ్ హ్యాండ్ కార్లను డీల్ చేయడంతోపాటు ఫైనాన్షియర్‌గా కూడా వ్యవహరించాడు. అయితే సింగ్ నకిలీ పత్రాలను రూపొందించి దొంగిలించిన కార్లను విక్రయించేవాడని పోలీసులు గుర్తించారు. 2006లో సింగ్ కు వివాహం అయ్యింది. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 

2015లో, అతనికి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా రేఖతో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత గణేష్ నగర్‌లో ఆమెతో కలిసి ఉంటున్నాడు. ఖర్చులన్నీ అతనే భరించేవాడు. అయితే ఇటీవల.. సింగ్ తన మొదటి భార్య, పిల్లల దగ్గరికి వెళ్లాలనుకుంటున్నాడని రేఖకు అనుమానం వచ్చింది. వారితో సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని ఆమె అతన్ని కోరిందని, పంజాబ్‌లో ఉన్న వారిని కలవకుండా అతన్ని ఆపిందని ఒక అధికారి తెలిపారు. ఒకవేళ అలా వెడితే అతని నేరచరిత్ర బయటపెడతానని రేఖ బెదిరించిందని తెలిపారు. 

దీంతో సింగ్ తాను పూర్తిగా రేఖ వలలో చిక్కుకున్నానని.. అందులోనుంచి బయటపడాలని భావించినట్లు చెప్పాడు. అందుకోసం ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిసాడు. దీనికోసం గురువారం అర్థరాత్రి దాటిన తరువాత ఆమె మీద దాడి చేశాడు. చాపర్ తో ఆమెను చంపి అక్కడినుంచి పరారయ్యాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios