Asianet News TeluguAsianet News Telugu

ఎక్కడికి వెళ్లినా భారత్ ను నాతో తీసుకెళ్తాను - గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్

భారత సంతతికి చెందిన గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ పద్మభూషణ్ అవార్డు శుక్రవారం అందుకున్నారు. ఈ పురస్కారాన్ని అమెరికాలో రాయబారి తరణ్జిత్ సింగ్ సంధూ ఆయనకు అందజేశారు. 

I will take India with me wherever I go -  Google, Alphabet CEO Sundar Pichai
Author
First Published Dec 3, 2022, 11:12 AM IST

తాను ఎక్కడికి వెళ్లిన తన వెంట భారత్ ను తీసుకెళ్తానని గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. భారత సంతతికి చెందిన ఆయనకు అమెరికాలో ఇండియా రాయబారి తరణ్జిత్ సింగ్ సంధూ నుంచి  పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశం తనలో ఒక భాగమని అన్నారు. తాను ఎక్కడికి వెళ్లిన దేశాన్ని తీసుకెళ్తానని గర్వంగా చెప్పారు. 

టీఎంసీ నేత ఇంట్లో భారీ పేలుడు.. ఇద్దరు కార్యకర్తల మృతి
 
‘‘ఈ అపారమైన గౌరవాన్ని అందించిన భారత ప్రభుత్వానికి, భారత ప్రజలకు నేను చాలా కృతజ్ఞుడిని. నన్ను తీర్చిదిద్దిన దేశం ఈ విధంగా నన్ను గౌరవించడం చాలా గర్వంగా ఉంది’’ అని అన్నారు. తన ఆసక్తులను కోసం తన తల్లిదండ్రులు ఎంతో త్యాగం చేశారని అన్నారు. నేర్చుకునే తత్వం, జ్ఞానాన్ని ప్రేమించే కుటుంబంలో పెరగడం తన అదృష్టం అని ఆయన చెప్పారు.

తాను చెప్పిన సర్ఫ్ భర్త తేలేదని... పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య...!

టెక్నాలజీపై ప్రధాని నరేంద్ర మోడీ దార్శనికతను సుందర్ పిచాయ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘‘ప్రధాని మోడీ డిజిటల్ ఇండియా విజన్ ఖచ్చితంగా ఆ పురోగతికి వేగవంతం చేసింది. గూగుల్ భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తోంది, రెండు పరివర్తన దశాబ్దాలకు పైగా ప్రభుత్వాలు, వ్యాపారాలు, సమాజాలతో భాగస్వామ్యం నెరపడం నాకు గర్వంగా ఉంది’’ అని సుందర్ పిచాయ్ అన్నారు.

కాగా.. 2022 సంవత్సరానికి గాను గూగుల్ సీఈఓకు వాణిజ్య, పరిశ్రమల విభాగంలో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ లభించిన సంగతి తెలిసిందే. పద్మ భూషణ్ దేశంలో మూడో అత్యున్నత పౌర పురస్కారం. మదురైలో జన్మించిన సుందర్ పిచాయ్ శుక్రవారం శాన్ ఫ్రాన్సిస్కోలో సన్నిహితుల సమక్షంలో ఈ అవార్డును అందుకున్నారు. అయితే భారతదేశంలో జరుగుతున్న డిజిటల్ విప్లవాన్ని గూగుల్ పూర్తిగా ఉపయోగించుకుంటుందని అమెరికాలో భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సంధూ ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios