Asianet News TeluguAsianet News Telugu

ఉద్ధవ్ ప్రభుత్వం పడిపోతే ప్రతిపక్షంలో కూర్చుంటాం- ఎన్సీపీ వైఖ‌రి స్ప‌ష్టం చేసిన జయంత్ పాటిల్

మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని ఉద్ద‌వ్ ఠాక్రే ప్ర‌భుత్వం కూలిపోతే తాము త‌ప్ప‌కుండా ప్ర‌తిప‌క్షంలో కూర్చుంటామ‌ని ఎన్సీపీకి చెందిన మంత్రి జ‌యంత్ పాటిల్ అన్నారు. ఏక్ నాథ్ షిండే వ్యవహారం శివసేన అంతర్గత సమస్య అని అన్నారు. 

If Uddhav government falls, we will sit in opposition - Jayant Patil clarified NCP stance
Author
Mumbai, First Published Jun 23, 2022, 3:38 PM IST

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఎన్సీపీ నాయ‌కుడు, మంత్రి జ‌యంత్ పాటిల్ స్పందించారు. అధికారం కోసం తాము బీజేపీతో పొత్తు పెట్టుకోబోమ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న శివసేన, కాంగ్రెస్‌లతో పాటు ఎన్‌సీపీ భాగ‌మైన ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఆయ‌న అంగీక‌రించారు. 

maharashtra crisis : ఏక్‌నాథ్‌కు షాక్.. అధిష్టానంతో తిరిగొచ్చిన ఇద్దరు శివసేన ఎమ్మెల్యేల భేటీ

“ ప్రభుత్వం కొనసాగితే మేము అధికారంలో ఉంటాం. ప్రభుత్వం ప‌డిపోతే ప్రతిపక్షంలో కూర్చుంటాం. అంతేగాని బీజేపీతో పొత్తు పెట్టుకోము’’ అని ఆయ‌న తెలిపారు. మ‌హారాష్ట్రలో ప‌రిస్థితి బలపరీక్ష దశకు చేరుకుందని తాను నమ్మడం లేదని ఆయ‌న అన్నారు. “ మేము (NCP చీఫ్) శరద్ పవార్ నివాసంలో సమావేశం అయ్యాం. గ‌డిచిన మూడు, నాలుగు రోజుల్లో జ‌రిగిన నాట‌కీయ ప‌రిణామాల‌ను మేము చ‌ర్చించాం. పవార్ సాహెబ్ మాకు ప్రభుత్వం కొన‌సాగేలా చేయాల్సిన‌వ‌న్నీ చెప్పారు. మేము ఉద్ధవ్ ఠాక్రేతో ఈ ప్రభుత్వంతో నిలబడతాం. ఈరోజు సాయంత్రం 5 గంటలకు తాజా ప‌రిణామాల‌పై చ‌ర్చించ‌డానికి మా ఎమ్మెల్యేలందరినీ సమావేశానికి ఆహ్వానించాం. మా ఎంపీలు, ఆర్గనైజేషన్ చీఫ్ (శరద్ పవార్) కూడా అక్కడే ఉంటారు’’ అని పాటిల్ అన్నారు.

పెళ్లి వేడుకల్లో వరుడు ఫైరింగ్.. గన్ ఇచ్చిన ఫ్రెండ్ దుర్మరణం (వీడియో)

సీఎం పదవి విషయంలో పాటిల్ మాట్లాడుతూ.. ఇది శివసేన అంతర్గత వ్యవహారమని అన్నారు. శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని, ఎవరికి ఇవ్వాలనేది వారి అంతర్గత నిర్ణయమ‌ని చెప్పారు. మ‌హారాష్ట్రకు వ‌చ్చి షిండే త‌న శిబిరంలోని బ‌లాన్ని చూపించాల‌ని స‌వాలు విసిరారు ఒక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, మరో రాష్ట్రంలో బలాన్ని చూపిస్తార‌ని తాను అనుకోవ‌డం లేద‌ని అన్నారు. తన ఎమ్మెల్యేలను గవర్నర్‌కు చూపించేందుకు ఆయన (శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే) ఇక్కడికి రావాల్సి ఉందని. ఆ తర్వాత గవర్నర్ అవసరమైన నిర్ణయం తీసుకుంటారని జ‌యంత్ పాటిల్ అన్నారు. 

జనం వరదల్లో కొట్టుకుపోతున్నా బీజేపీకి అధికారమే సర్వస్వం.. మోడీపై అసోం కాంగ్రెస్ ఎంపీ ఫైర్

కాగా మ‌హారాష్ట్రలో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభాన్ని నివారించడానికి ఉద్ధవ్ షిండేకు సీఎం పదవిని ఆఫర్ చేశారని, అయితే తిరుగుబాటు నాయకుడు దానిని తిరస్కరించారని నిన్న వార్త‌లు వెలువ‌డ్డాయి. అయితే తాజాగా అసంతృప్తి శిబిరం నుంచి వెలువ‌డిన లేఖ‌ను ఏక్ నాథ్ షిండే విడుద‌ల చేశారు. సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే ను క‌లిసేందుకు త‌మ‌కు అవ‌కాశం ద‌క్కేది కాద‌ని, కానీ ఎన్సీపీ, కాంగ్రెస్ నేత‌లు సుల‌భంగా క‌లిసేవార‌ని ఎమ్మెల్యేలు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కు నిధులు విడుద‌ల కాక‌పోయినా.. ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు మాత్రం నిధులు వెంట వెంట‌నే వెళ్లేవ‌ని ఆరోపించారు. తాము సీఎం దిగిపోవాల‌ని కోరుకోవ‌డం లేద‌ని, అయితే బీజేపీతో పొత్తు పెట్టుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. త‌మ‌కు ఎన్సీపీ, కాంగ్రెస్ నేత‌ల ముందు తీవ్ర అవ‌మానం జ‌రిగింద‌ని ఆ లేఖ‌లో తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios