రాముడు ఇప్పుడు ఉంటే.. బీజేపీ ఈడీని ఆయన ఇంటికి పంపేది - కేజ్రీవాల్
రాముడు ఇప్పుడు జీవించి ఉంటే ఆయన ఇంటికి కూడా బీజేపీ ఈడీని, సీబీఐను పంపించి ఉండేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బీజేపీలో చేరాలని బెదిరింపులకు పాల్పడి ఉండేదని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర విమర్ళలు చేశారు. శ్రీ రాముడు ఈ యుగంలో జీవించి ఉంటే ఆయన కోసం కూడా బీజేపీ ఈడీని పంపించి ఉండేదని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో శనివారం బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. తనకు తమ్ముడు మనీష్ సిసోడియా గుర్తుకు వస్తున్నారని అన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
‘‘ఇది మా ప్రభుత్వానికి 10వ బడ్జెట్. గత 9 బడ్జెట్లను మనీష్ సిసోడియా ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది ఈ అసెంబ్లీలో ఆయన మా ప్రభుత్వ 11వ బడ్జెట్ ను ప్రవేశపెడతారని ఆశిస్తున్నాను.’’ అని కేజ్రీవాల్ తెలిపారు. ప్రతిపక్ష నాయకులపై కేంద్ర సంస్థలు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో బీజేపీపై ఆయన విరుచుకుపడ్డారు. ‘‘శ్రీరాముడు ఈ యుగంలో ఉండి ఉంటే, బీజేపీ ఈడీని, సీబీఐని ఆయన ఇంటికి పంపించేది. ఆయన తలపై తుపాకీ పెట్టి, బీజేపీలో చేరుతారా లేదా జైలుకు వెళ్తారా ? అని ప్రశ్నించేది’’ అని విమర్శించారు.
టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై తేలిన లెక్కలు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే ?
వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాల పతనంపై కేజ్రీవాల్ బీజేపీపై విమర్శలు చేశారు. మొహల్లా క్లినిక్ ల నిర్మాణాన్ని అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాను ఢిల్లీ ప్రజలను ప్రేమిస్తున్నానని, ఢిల్లీ ప్రజలు తనను ప్రేమిస్తున్నారని చెప్పారు. వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని అన్నారు.
ఢిల్లీకి శత్రువులు ఎవరో అర్థం చేసుకోవాలని, వారిని శాశ్వతంగా ఇక్కడి నుంచి తరిమికొట్టాలని కోరారు. కాగా.. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలను స్పీకర్ ఈ నెల 15వ తేదీకి వాయిదా వేశారు.