ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల కోసం ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించింది. ఉద్యోగులందరికీ 21 శాతం ఫిట్ మెంట్ ఇవ్వబోతున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. దీని వల్ల నెలకు రూ.35 కోట్ల భారం పడుతుందని తెలిపారు.

Telangana govt announces good news for RTC employees 21 per cent PRC announcement,,ISR

ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. 21 శాతం ఫిట్ మెంట్ ఇస్తామని పేర్కొంది. ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం వెల్లడించారు. కొత్త ఫిట్ మెంట్ జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై తేలిన లెక్కలు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే ?

కొత్త పీఆర్సీ అమల్లోకి వస్తే తెలంగాణ ఆర్టీసీపై నెలకు రూ.35 కోట్ల భారం పడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అయితే దీని వల్ల 53,071 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని అన్నారు. 

చైనా సరిహద్దుల్లో రెండు పినాకా రిజిమెంట్లు: మోహరించనున్న భారత్

ఇదిలా ఉండగా.. హుస్నాబాద్ లో కొత్త బస్టాండ్ కు మంత్రి పొన్నం శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభం వల్ల ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగిందని అన్నారు.  రాష్ట్రంలో ఇప్పటివరకు 26 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ పథకాలు పొందారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను కొనుగోలు చేయాలని, కొత్త బస్ స్టేషన్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. 

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. బీఆర్ఎస్ నేత సీతారాం నాయక్‌ టార్గెట్!

ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. హుస్నాబాద్ నుంచి ప్రతీ రోజు 25 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని, అందుకే ఇక్కడ కొత్త బస్ స్టాండ్ ను నిర్మిస్తున్నామని తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios