Asianet News TeluguAsianet News Telugu

నేను ఆనాడు అజిత్ పవర్ ను పంపి ఉంటే.. ఆ ప్రభుత్వం ఇప్పటికీ కొనసాగేది - శరద్ పవార్

ఎన్ సీపీ అధినేత శరాద్ పవార్ ఇటీవల మరాఠీ లోక్ సత్తా నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా 2019 ఎన్నికల సమయంలో జరిగిన నాటకీయ పరిణామాలను ఆయన మీడియాతో పంచుకున్నారు. తాను అజిత్ పవార్ ను బీజేపీ వద్దకు పంపలేదని చెప్పారు. 

If I had sent Ajit Power .. that government would still be in power - Sharad Pawar
Author
Maharashtra, First Published Dec 30, 2021, 2:50 PM IST

శ‌ర‌ద్ ప‌వార్..ఎన్‌సీపీ అధినేత‌. రాజ‌కీయ కుర‌వృద్ధుడు. ప్రస్తుత మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం సాఫీగా కొన‌సాగ‌డంలో ఆయ‌న కీలకపాత్ర పోషిస్తున్నాడు. 2019 లో మహరాష్ట్ర  అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆ స‌మ‌యంలో జ‌రిగిన నాట‌కీయ ప‌రిణామాల‌ను ఆయ‌న ఇటీవ‌ల మీడియాతో పంచుకున్నారు. మరాఠీ వార్తాపత్రిక లోక్‌సత్తా నిర్వహించిన ఒక కార్యక్రమానికి ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఎన్నిక‌ల ముగిసిన అనంత‌రం అజిత్ ప‌వ‌ర్ ప‌వ‌ర్ చేసిన ప‌నిని ప్ర‌స్తావిస్తూ.. 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత మహారాష్టలో ప్రభుత్వం ఏర్పాటు చేయ‌డానికి తన పార్టీ సహచరుడు అజిత్ పవార్‌ను పంపి ఉంటే, ఆ ప్రభుత్వం అధికారంలో ఉండేలా చూసుకునే వాడిన‌ని అన్నారు. 

Uttar Pradesh Assembly elections 2022: షెడ్యూల్ ప్రకారమే యూపీలో ఎన్నికలు... తేల్చేసిన సీఈసీ

తాను అలా చేసి ఉంటే ఆ ప్ర‌భుత్వం ఇప్ప‌టికీ కొన‌సాగి ఉండేద‌ని తెలిపారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆధ్వర్యంలోని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం బాగా ప‌ని చేస్తోంద‌ని కొనియాడారు. సీఎం కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ మంచి అనుభ‌వం ఉన్న మంత్రులు ఉండ‌టం వ‌ల్ల ప‌రిపాల‌న చ‌క్క‌గా సాగుతోంద‌ని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత జ‌రిగే రాజకీయ ప‌రిణామాల‌పై మాట్లాడుతూ.. తాను ఏ కూట‌మికి నాయ‌క‌త్వం వ‌హించ‌బోన‌ని, అయితే నాయ‌క‌త్వం వహించే వ్యక్తికి మద్దతు ఇస్తాన‌ని, అలాగే వారికి మార్గ‌నిర్దేశం చేయాల‌నుకుంటున్నాన‌ని అన్నారు. 2022 ప్రారంభంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ వాస్త‌వ ప‌రిస్థితులు గుర్తించింద‌ని, అందుకే ప్ర‌ధానమంత్రి ఆ రాష్ట్రంలో ఎక్కువ‌గా ర్యాలీలు నిర్వ‌హిస్తున్నార‌ని, అనేక కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రువుతున్నార‌ని చెప్పారు. 

అప్పుడేం జ‌రిగిందంటే...
మ‌హారాష్ట్ర అసెంబ్లీకి 2019లో ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆ రాష్ట్రంలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే ఇందులో ఏ పార్టీకి పూర్తిగా మ‌ద్ద‌తు రాలేదు. బీజేపీ 105 స్థానాలు, శివ‌సేన 56 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 44 స్థానాలు, ఎన్‌సీపీ 54 స్థానాలు, ఇత‌ర పార్టీలు, స్వ‌తంత్ర అభ్య‌ర్థులు క‌లిపి 23 స్థానాలు గెలుచుకున్నారు. దీంతో శ‌ర‌త్ ప‌వార్ ఆధ్వ‌ర్యంలోని ఎన్‌సీపీకి ‘కీ’ రోల్ పోషించే అవకాశం వచ్చింది. అయితే ఈ విష‌యంలో చ‌ర్చలు జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ఎన్‌సీపీ పార్టీ ముఖ్య‌నేత అజిత్ ప‌వార్ బీజేపీకి మ‌ద్ద‌తు ఇస్తున్నట్టు ప్ర‌క‌టించారు. బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తున్న‌ట్టు గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు వెళ్లారు. దీంతో బీజేపీ నుంచి సీఎం అభ్య‌ర్థిగా దేవేంద్ర ప‌డ్న‌వీస్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. 

ఆ మెట్లు ఎక్కినా.. దిగినా.. మ్యూజిక్కే మ్యూజిక్కు.. ఎక్కడంటే...

త‌ద‌నంత‌రం జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల వ‌ల్ల ఎన్‌సీపీ శివ‌సేన పార్టీకి మ‌ద్ద‌తు తెలిపింది. దీంతో ప‌డ్న‌వీస్ ఆధ్వ‌ర్యంలోని బీజేపీ ప్ర‌భుత్వం అసెంబ్లీలో బ‌లాన్నినిరూపించుకోలేక‌పోయింది. దీంతో ఆ ప్ర‌భుత్వం మూడు రోజుల్లోనే కూలిపోయింది. త‌రువాత శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలు క‌లిసి ‘మ‌హా వికాస్ అజాదీ ’ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ కూట‌మికి శివ‌సేన అధినాయ‌కుడు ఉద్ద‌వ్ టాక్రే నేతృత్వం వ‌హిస్తున్నారు. ఆయ‌న సీఎంగా కొన‌సాగుతుండ‌గా.. మిగితా రెండు పార్టీల నుంచి మంత్రులు ఉన్నారు. త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కు ఆ కూట‌మి సాఫీగా పాల‌న సాగిస్తోంది. పార్టీల మ‌ధ్య అభిప్రాయ బేధాలు వ‌చ్చినప్పుడు శ‌రద్ ప‌వార్ వాటిని స‌రిదిద్దుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios