Asianet News TeluguAsianet News Telugu

Uttar Pradesh Assembly elections 2022: షెడ్యూల్ ప్రకారమే యూపీలో ఎన్నికలు... తేల్చేసిన సీఈసీ

 షెడ్యూల్ ప్రకారమే యూపీలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని  సీఈసీ సుశీల్‌చంద్ర తెలిపారు. ఇవాళ పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు సీఈసీ తో భేటీ అయ్యారు. 

Uttar Pradesh Assembly elections 2022  to be held as scheduled : CEC Chandra.
Author
Lucknow, First Published Dec 30, 2021, 12:36 PM IST


లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి షెడ్యూల్ ప్రకారంగానే ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది. పలు రాజకీయ పార్టీలతో గురువారం నాడు ఈసీ ఇవాళ  సమావేశమైంది., నిర్ణీత షెడ్యూల్ ప్రకారంగానే ఎన్నికలు నిర్వహించాలని రాజకీయ పార్టీలు కోరాయి. దీంతో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికల నిర్వహణకు ఈసీ ఎన్నికల కమిటీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా నిబంధనలను పాటిస్తూ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకొంటామని సీఈసీ Sushil Chandra ప్రకటించారు.  ఓటర్లు భౌతిక దూరం పాటించేలా Polling బూతుల సంఖ్యను పెంచుతామని ఎన్నికల సంఘం తెలిపింది.

రాజకీయ పార్టీలతో సమావేశం ముగిసిన తర్వాత సీఈసీ సుశీల్ చంద్ర గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. 2022 జనవరి 5న తుది ఓటర్ల జాబితాను అందిస్తామని సీఈసీ తెలిపారు.  అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైనట్టుగా ఆయన చెప్పారు. కరోనా నిబంధనలను పాటిస్తూ షెడ్యూల్ ప్రకారంగానే ఎన్నికలు నిర్వహించాలని తమకు రాజకీయ  పార్టీలు సూచించాయని సుశీల్ చంద్ర తెలిపారు. 

ఎన్నికలు నిర్వహించాల్సిన అన్ని రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించామని సీఈసీ  చెప్పారు.  అయితే ఇటీవలనే అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో సభలు, ర్యాలీలతో పాటు ఎన్నికలను వాయిదా వేయాలని కోర్టు సూచించింది. జీవించి ఉంటేనే ప్రపంచం ఉంటుంది... వీలైతే ఎన్నికలను వాయిదా వేయాలని కోర్టు కోరింది. బతికి ఉంటేనే ర్యాలీలు, సభలు, ఎన్నికలు నిర్వహించుకొనేందుకు అవకాశం ఉంటుందని అలహాబాద్ కోర్టు జస్టిస్ శేఖర్ కుమార్ వ్యాఖ్యానించారు..

also read:UP Elections: నేను ఎవరి ఏజెంట్ నో డిసైడ్ చేసుకోండి.. అసదుద్దీన్ ఓవైసీ..!

అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో యూపీ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించింది. ఈ పర్యటన నిన్నటితో ముగిసింది. ఈ పర్యటన ముగిసిన మరునాడే సీఈసీ షెడ్యూల్ ప్రకారమే యూపీలో ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా ప్రకటించారు.

మూడు రోజుల పర్యటనలో జిల్లా మేజిస్ట్రేట్‌లు, ఎస్పీలతో పాటు ఇతర ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం ప్రతినిధులు సమావేశమయ్యారు. ఎన్నికలు స్వేచ్ఛంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వచ్చే ఏడాదిలో ఉత్తర్‌ప్రదేశ్ , ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. 

ఎన్నికల విధులకు హాజరయ్యే పోలింగ్ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ వేయిస్తామని సీఈసీ ప్రకటించింది.  ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని ఈసీ తెలిపింది. అన్ని ఓటింగ్ బూత్ ల వద్ద వీవీ‌ప్యాట్ లను అమర్చనున్నట్టుగా సీఈసీ తెలిపింది.

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు గాను లక్ష పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యక్ష బెబ్ కాస్టింగ్  సౌకర్యాలు అందుబాటులో ఉంచుతామని సీఈసీ చెప్పారు. వచ్చే ఏడాది మే 14న యూపీ అసెంబ్లీ కాల పరిమితి ముగియనుంది. ఈ లోపుగా ఎన్నికలు నిర్వహించాలి. ఈ ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. మరో వైపు బీజేపీని గద్దెదించి అధికారంలోకి రావాలని సమాజ్‌వాదీ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios