Asianet News TeluguAsianet News Telugu

సిసోడియా ఫోన్ సీబీఐ స్వాధీనం చేసుకుంటే ఆయ‌న మెసేజ్ ఇలా చ‌దివారు ? - ఆప్ నేత‌కు బీజేపీ కౌంట‌ర్

తనను ఆప్ వదిలి బీజేపీలో చేరాలని ఒత్తిడి చేస్తూ సందేశం వచ్చిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చేసిన వ్యాఖ్యలకు మనోజ్ తీవారి కౌంటర్ కౌంటర్ ఇచ్చారు. ఆప్ నాయకుడి ఫోన్ సీబీఐ వద్ద ఉంటే సందేశం ఎవరికి వచ్చిందని ప్రశ్నించారు. 

If CBI seizes Sisodia's phone, he will read this message ?- BJP counter to AAP leader
Author
First Published Aug 22, 2022, 4:20 PM IST

ఆమ్ ఆద్మీ పార్టీ నాయ‌కుడు, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియా బీజేపీపై చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఖండించింది. అవన్నీ ఆరోప‌ణ‌ల‌ను అని చెప్పింది. నేటి ఉద‌యం సిసోడియా ట్విట్ట‌ర్ లో కాషాయ పార్టీపై ఆరోప‌ణ‌లు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరితే సీబీఐ, ఈడీ కేసులు అన్నీ ఎత్తివేస్తామ‌ని ఆ పార్టీ నుంచి త‌న‌కు మెజేస్ వ‌చ్చిందని పేర్కొన్నారు. ఈ ట్వీట్ పై బీజేపీ నేత మనోజ్ తివారీ స్పందించారు. సిసోడియా ఫోన్ ను సీబీఐ స్వాధీనం చేసుకుంద‌ని ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించార‌ని చెప్పారు. మ‌రి అలాంట‌ప్పుడు ఆయన మెసెజ్ ఎవ‌రి ఫోన్ లో చ‌దివార‌ని ప్ర‌శ్నించారు.

ఇండియన్ లీడర్‌పై ఆత్మాహుతికి ప్లాన్.. రష్యాలో పట్టుబడ్డ ఐఎస్ టెర్రరిస్టు.. ప్రవక్తను అవమానించినందుకే కుట్ర!

“ కానీ మనీష్ సిసోడియా ఫోన్‌ను సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా చెప్పారు. కాబట్టి ఎవరి ఫోన్‌లో టెక్స్ట్ సందేశం లేదా కాల్ వచ్చిందో ఆయ‌న చెప్పాలి. విచారణ కోసం ఆ ఫోన్‌ను డిపాజిట్ చేయాలి. ’’ అని ఆయన అన్నారు. 

ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ 2021-22లో అవకతవకలకు సంబంధించి సిసోడియా నివాసంతో సహా 31 చోట్ల సీబీఐ శుక్రవారం దాడులు నిర్వహించింది. తన ఇంట్లో సోదాల తర్వాత, తన ల్యాప్‌టాప్, ఫోన్‌ను సీబీఐ దొంగలు ఎత్తుకెళ్లారని ఆప్ నాయకుడు విమ‌ర్శించారు. గతేడాది నవంబరు 17 నుంచి అమల్లోకి వచ్చిన పాలసీ అమలులో నిబంధనల ఉల్లంఘనలు, విధానపరమైన లోపాలు ఉన్నాయ‌ని సీబీఐ ఆరోపించింది. విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా గ‌త నెల‌లో సిఫార్సు చేయ‌డంతో సీబీఐ రైడ్ నిర్వ‌హించింది. కాగా.. విచారణకు సక్సేనా సిఫారసు చేసిన వెంట‌నే ఢిల్లీ ప్రభుత్వం జూలైలో ఈ విధానాన్ని ఉపసంహరించుకుంది.

దారుణం.. 13 ఏళ్ల బాలిక‌పై నాలుగు రోజుల పాటు 6 గురు గ్యాంగ్ రేప్.. బీహార్ లో ఘ‌ట‌న

అయితే శుక్ర‌వారం సీబీఐ రైడ్ నిర్వ‌హించిన త‌రువాత ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో అక్రమాలకు సంబంధించి మ‌నీస్ సిసోడియాతో పాటు 15 మంది వ్యక్తుల‌పై అభియోగాలు మోపింది. ఇవి అన్నీ కేవ‌లం ఆరోప‌ణ‌లే అని ఆప్ ఖండిస్తోంది. అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌ధాని మోడీకి ప్ర‌త్యామ్నాయంగా ఎదుగుతున్నార‌నే కార‌ణంతోనే కేంద్రం ఇదంతా చేస్తోంద‌ని ఆరోప‌ణ‌లు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో మ‌నీష్ సిసోడియా ఈరోజు తెల్ల‌వారుజామున ఓ ట్వీట్ చేశారు. 

దేశంలో తొలి ఎడ్యుకేషన్ టౌన్‌షిప్ నిర్మాణానికి యూపీ ప్రభుత్వం నిర్ణయం.. యాక్షన్ ప్లాన్‌కు సీఎం ఆదేశాలు

‘‘ ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ)ని  విచ్చిన్నం చేసి బీజేపీలో చేరండి అని నాకు సందేశం వచ్చింది. మీపై  సీబీఐ, ఈడీలు పెట్టిన అన్ని కేసులను మూసివేసేలా చూస్తాం బీజేపీ తెలిపింది ’’ అని సిసోడియా పేర్కొన్నారు. తనపై ఉన్న కేసులన్నీ అబద్ధాలేనని నొక్కి చెప్పిన ఆయన కాషాయపార్టీకి సవాల్ విసిరారు. ‘‘బీజేపీకి నా సమాధానం చెప్తున్న. నేను మహారాణా ప్రతాప్ వారసుడిని. రాజపుత్రుడిని. తల నరుక్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ కుట్రదారులు, అవినీతిపరుల ముందు ఎప్పటికీ మోకరిల్లలేను. నాపై ఉన్న కేసులన్నీ అవాస్తవాలే. మీరు ఏమి చేయాలనుకుంటున్నారో అది చేయండి’’ అని ఆయన పేర్కొన్నారు.  ఈ ట్వీట్ కు కౌంట‌ర్ ఇస్తూ బీజేపీ నేత మనోజ్ తివారీ తాజాగా వ్యాఖ్య‌లు చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios