డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘కాళీ’ వాల్ పోస్టర్ పై వివాదం ముదురుతోంది. తాజాగా దీనిపై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు. ఆ డైైరెక్టర్ కావాలనే ఇలాంటి పోస్టర్ విడుదల చేశారని అన్నారు. మతపరమైన ఇలాంటి పోస్ట్ లను ఎప్పటికప్పుడు చెక్ చేయాలని ట్విట్టర్ ను కోరారు.

మత మనోభావాలను దెబ్బతీసే ట్వీట్ ల‌ను చెక్ చేయాల‌ని ట్విట్ట‌ర్ లేఖ రాస్తానని మ‌ధ్య‌ప్ర‌దేశ్ హోం మంత్రి న‌రోత్త‌మ్ మిశ్రా అన్నారు. కాళీ పోస్టర్‌పై నెల‌కొన్న వివాదం నేప‌థ్యంలో ఆయ‌న గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. కొందరు వ్యక్తులు హిందూ దేవుళ్లు, దేవతలను కించపరిచే విధంగా చిత్రీకరించడాన్ని తాను తీవ్రంగా పరిగణించానని మధ్యప్రదేశ్ మంత్రి అన్నారు.

దేవత ధూమపానం చేస్తూ, ఎల్‌జీబీటీక్యూ జెండాను పట్టుకుని వివాదంగా ఉన్న తన డాక్యుమెంటరీ చిత్రం ‘కాళి’ పోస్టర్‌ను ట్వీట్ చేసిన కెనడాకు చెందిన ఫిల్మ్ మేకర్ లీనా మణిమేకలైపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్రానికి లేఖ రాస్తుందని న‌రోత్త‌మ్ మిశ్రా మీడియాతో తెలిపారు. 

విద్యార్థులు చ‌దువుకునేందుకు రాలేద‌ని.. 23 ల‌క్ష‌ల జీతాన్ని తిరిగిచ్చేసిన ప్రొఫెస‌ర్..

‘‘ కాళీ చిత్ర దర్శకురాలు లీనా మణిమేకలై లాంటి మనస్తత్వం ఉన్నవారు పోస్ట్ చేసిన ట్వీట్లను ట్విటర్ చెక్ చేయాలి. కాళి బీడీ తాగుతున్న ఫొటో లేదా (లార్డ్) శంకర్ జీ ఫొటోను పోస్ట్ చేస్తూ మతపరమైన మనోభావాలను దెబ్బతీసేందుకు ట్విట్టర్ ను ఉపయోగించుకుంటున్నారు. అలాంటి మెసేజ్ లను ట్విట్ట‌ర్ ఆదిలోనే ఆపేసేయాలి. ’’ అని ఆయన అన్నారు. కాగా కాళీ దర్శకురాలు లీనా మణిమేకలై ట్వీట్‌ను ట్విట్టర్‌ ఇటీవల ఉపసంహరించుకుంది.

Bhagwant Mann Wedding: ఘనంగా భగవంత్ మాన్ పెళ్లి.. హాజరైన కేజ్రీవాల్.. ఫోటోలు..

అయితే బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, కెనడాకు చెందిన ఫిల్మ్ మేకర్ లీనా మణిమేకలైపై మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు వేర్వేరు బుధవారం మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. అయితే రత్లాంలో మణిమేకలైపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. కాగా ఈ విషయంలో మణిమేకలై స్పందించారు. తాను జీవించి ఉన్నంత వరకు నిర్భయంగా తన వాయిస్‌ని వినిపిస్తూనే ఉంటానని చెప్పారు. ఆమె ప్రముఖ ఫిల్మ్ మేకర్. ఇటీవల కాళీ అనే డాక్యుమెంటీ రూపొందించింది. అయితే, డాక్యుమెంటరీ కోసం రూపొందించిన ఓ పోస్టర్ వివాదానికి కారణమయ్యింది.

Bakrid festival: బక్రీద్ కు పశువులను బలి ఇవ్వకండి : క‌ర్నాట‌క మంత్రి

వివాదాస్పదమైన ఆ పోస్టర్ లో కాళీ మాత సిగరెట్ తాగుతూ.. ఓ చేత్తో ఎల్జీబీటీ జెండాను పట్టుకుని ఉంది. దీంతో ఈ పోస్టర్ మీద సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది. ఆమెపై తీవ్ర స్థాయిలో ట్రోటింగ్ మొదలయ్యింది. ట్విట్టర్లో అయితే #arrestleenamanimekalai హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. ఈ విషయంలో ప్రధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ‌స్తున్నాయి.