ప్రజ్ఞా ఠాకూర్‌కు టికెట్ నిరాకరణ.. ‘మోడీ నన్ను క్షమించలేదు’
ప్రజ్ఞా ఠాకూర్‌కు ఈ సారి బీజేపీ టికెట్ ఇవ్వేలేదు. ఈ నిర్ణయంపై ఆమె మాట్లాడారు. గతంలో తాను నాథూరామ్ గాడ్సే గురించి పొగడటం ప్రధాని మోడీకి స్పందించడాన్ని గుర్తు చేశారు. ప్రధాని మోడీ తనను క్షమించలేదని కామెంట్ చేశారు.
బీజేపీ లోక్ సభ ఎన్నికల కోసం 195 మంది అభ్యర్థుల జాబితాను శనివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో 33 మంది సిట్టింగ్ ఎంపీల పేర్లు గల్లంతయ్యాయి. అందులో మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ పేరు కూడా లేదు. బీజేపీ తనకు మరోసారి టికెట్ ఇవ్వకపోవడంపై ఆమె స్పందించారు.
ఇండియా టుడే టీవీతో ఆమె మాట్లాడుతూ.. ‘ఇంతకు ముందు కూడా నేను టికెట్ ఆశించలేదు. ఇప్పుడు కూడా ఆశించలేదు. గతంలో నేను చేసిన వ్యాఖ్యల్లో ఉపయోగించిన పదాలు ప్రధానమంత్రి మోడీకి నచ్చేలేవు. నేను క్షమాపణలు చెప్పాను. కానీ, క్షమించలేను అని ఆయన వెల్లడించారు’ అని పేర్కొన్నారు.
Also Read: Hyderabad: అసదుద్దీన్ ఒవైసీపై పోటీకి బీజేపీ అనూహ్య ట్విస్ట్.. పార్టీ సభ్యత్వం లేకున్నా.. !
2019లో ప్రజ్ఞా ఠాకూర్ మహాత్మా గాంధీకి సంబంధించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గాంధీ హంతకుడు నాథురామ్ గాడ్సేను పొగిడారు. ఆయనే నిజమైన దేశభక్తుడు అంటూ వివాదాన్ని లేవనెత్తారు. ఆ తర్వాత ప్రధానమంత్రి మోడీ స్పందిస్తూ.. ఆమె ఇప్పటికే క్షమాపణలు చెప్పింది. కానీ, ఆమెను నేను ఎన్నటికీ క్షమించలేను అని పేర్కొన్నారు.