అంబానీ పార్టీలో ఫుడ్‌తో టిష్యూకు బదులు కరెన్సీ నోట్లు? ఆ వైరల్ ట్వీట్ ఏం చెబుతున్నదంటే?
అంబానీల ఇంట విందు జరిగితే.. అక్కడ ఫుడ్‌తో టిష్యూ పేపర్లు కాకుండా కరెన్సీ నోట్లు ఇస్తారని ఓ యూజర్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఫుల్ వైరల్ అయింది. ఈ ట్వీట్ నేపథ్యంలో చర్చ మొదలైంది. అవి నిజంగా కరెన్సీ నోట్లేనా? అనే చర్చ జరిగింది. కొందరు ఆ డిజర్ట్ గురించి తెలిసినవారు వివరణలూ ఇచ్చారు.
న్యూఢిల్లీ: సంపన్నులైన అంబానీల ఇంటి ఏ విందు జరిగినా అది ఆసక్తిని రేకెత్తిస్తుంది. మరే ఈవెంట్ నిర్వహించినా మీడియాలో అదో హెడ్‌లైన్ అయిపోతుంది. ధనిక కుటుంబం ఎలా పార్టీ నిర్వహిస్తుంది? ఎన్ని హంగులు ఉన్నాయి? ఆడంబరాలను గురించి ఆరా తీస్తుంటారు. అందుకే వారి పార్టీ గురించి ఏ ఫొటో బయటకు వచ్చినా.. ఏ ముచ్చట వచ్చినా.. దానిపై చర్చ జరుగుతూ ఉంటుంది. తాజాగా, ఇదే కోవలోకి వచ్చే ఓ ట్వీట్ తెగ వైరల్ అయింది.
రతనిశ్ అనే ట్విట్టర్ యూజర్ ఓ ట్వీట్ చేశాడు. సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఓ ఫుడ్ ఐటమ్ పిక్‌ను అతను పోస్టు చేశాడు. ఆ ఫుడ్ ఐటమ్‌తోపాటు కరెన్సీ నోట్లూ పెట్టి కనిపించాయి. వాటిని పేర్కొంటూ.. రతనీశ్ ఆ ఫొటోకు ఓ క్యాప్షన్ పెట్టాడు. అంబానీ పార్టీలో ఫుడ్ ఐటమ్‌తో టిష్యూ పేపర్‌కు బదులు రూ. 500 నోట్లు ఉంటాయి.. అని రాసుకున్నాడు. ఈ ట్వీట్ వైరల్ అయిపోయింది. చాలా మంది ఆ విధానంపై చర్చించారు. కొందరు అది తప్పని వాదిస్తుండగా.. ఇంకొందరు వారికి సమాధానం ఇచ్చారు. ఇంతకీ నిజంగా అంబానీల పార్టీలో టిష్యూ పేపర్లకు బదులు కరెన్సీ నోట్లను అతిథులకు ఇచ్చారా? దీనికి సమాధానం ‘కాదు’.
ఆ ఫొటోను చూస్తే అది కేవలం జోక్ అని అర్థమైపోతుంది. ఢిల్లీ వాస్తవ్యులకు ఇది తొందరగానే బోధపడుతుంది. ఎందుకంటే.. ఢిల్లీలో ఓ రిచ్ డైనింగ్ అందించే ఇండియన్ అస్సెంట్ అనే రెస్టారెంట్‌లో అందించే డిష్ అది. ఈ డిష్ పేరు దౌలత్ కీ చాట్. ఈ డిష్‌ను అంబానీ పార్టీలో సర్వ్ చేసి ఉండొచ్చు.
ఇండియన అస్సెంట్ రెస్టారెంట్ దౌలత్ కీ చాట్ అనే డిజర్ట్ అందిస్తున్నది. దీన్ని డిజర్ట్ ఆఫ్ ది రిచెస్ అని కూడా పిలుస్తారు. ఈ డిజర్ట్ అందించే కప్‌లో ఫేక్ కరెన్సీ నోట్లనూ పెట్టి రిచ్‌గా ప్రొజెక్ట్ చేస్తారు. కాబట్టి, డిజర్ట్‌తో కనిపిస్తున్నవి నిజమైన కరెన్సీ నోట్లు కావు. అవి ఫేక్ కరెన్సీ నోట్లు.
Also Read: గాడిద పాల సబ్బులు మహిళలను అందంగా ఉంచుతాయి.. క్లియోపాత్రా వాడేది: మేనకా గాంధీ వ్యాఖ్యలు వైరల్
ఏదేమైనా ఆ ట్వీట్ మాత్రం ఫుల్ వైరల్ అయింది. అది నిజమైన కరెన్సీ అని భ్రమపడ్డవారికి కొందరు ఆ డిజర్ట్ గురించి తెలిసినవారు వివరణలు ఇచ్చారు.