Asianet News TeluguAsianet News Telugu

సీఎం పదవి అవసరం లేదు, పార్టీ అధ్యక్షుడిగానే ఉంటా: రజనీకాంత్

తాను రాజకీయాల్లోకి  రావాలని ప్రజలు కోరుకొంటున్నారని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. అన్ని ప్రచారాలకు తాను ఇవాళ పుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తున్నాని ఆయన స్పష్టం చేశారు. 

I want to bring a change in Tamil Nadu politics, says Rajinikanth
Author
Chennai, First Published Mar 12, 2020, 10:49 AM IST

తమిళ రాజకీయాల్లో మార్పులు తీసుకొస్తానని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. తాను రాజకీయాల్లోకి  రావాలని ప్రజలు కోరుకొంటున్నారన్నారు. 

చెన్నై: తాను రాజకీయాల్లోకి  రావాలని ప్రజలు కోరుకొంటున్నారని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. అన్ని ప్రచారాలకు తాను ఇవాళ పుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తున్నాని ఆయన స్పష్టం చేశారు. 

Also read:నేడు పార్టీ ప్రకటన..? రజినీకాంత్ ఇంటి ముందు అభిమానుల సందడి

గురువారం నాడు చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్ లో  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు. జయలలిత మరణం తర్వాత  తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిందన్నారు. 

2017లోనే తాను రాజకీయాల్లోకి వస్తాననని ప్రకటించాను. అప్పుడే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు.   తమిళనాడులో రాజకీయ పరిస్థితుల గురించి విశ్లేషించడం మొదలు పెట్టానని చెప్పారు.  

15 ఏళ్లుగా  తన రాజకీయ ప్రవేశంపై అనేక ఊహగానాలు వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.   ప్రజల మనస్తత్వం కూడ మారాల్సిన అవసరం ఉందన్నారు. 

రాజకీయ నాయకులకు ప్రజలంటే కేవలం ఓట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. సమయానికి తగ్గట్టుగా పాలన సాగడం లేదన్నారు రజనీకాంత్. అత్యధిక మంది  నా పార్టీలో భాగస్వామ్యులయ్యేలా చూసుకొంటానని ఆయన తేల్చి చెప్పారు. 

వనరుల దుర్వినియోగం నా పార్టీలో ఉండదని  ఆయన చెప్పారు. ఊహగానాలకు స్వస్థి చెప్పాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. పదవులు ఆశించే వారు తనకు అవసరం లేదని రజనీకాంత్  తేల్చి చెప్పారు. 

జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆనాడే తాను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా రజనీకాంత్ చెప్పరు.రాజకీయాల్లోకి యువరక్తం రావాల్సిన అవసరం ఉందన్నారు. 60 నుండి 65 శాతం టిక్కెట్లను యువతకే ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ప్రభుత్వం, పార్టీపై ఒకే వ్యక్తి పెత్తనం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఏనాడూ ఊహించలేదు. ప్రభుత్వ వ్యవహరాల్లో పార్టీ అధ్యక్షుడి ప్రమేయం ఉండకూడదనేది తన అభిమతమన్నారు.

 పార్టీ అధ్యక్షుడిగా ఉండడంపైనపే దృష్టి పెడతా ముఖ్యమంత్రి పీఠంపై కాదని ఆయన ప్రజలకు స్పష్టత ఇచ్చారు.  నా వయస్సు 68 ఏళ్లు. నాకు సీఎం పదవి అవసరమా అని ఆయన ప్రశ్నించారు. బాగా చదువుకొన్న వ్యక్తినే సీఎం గా చేస్తానని రజనీకాంత్ చెప్పారు.  

మార్పు ఇప్పుడు జరగకపోతే ఇక ఎప్పుడూ జరగదని ఆయన తేల్చి చెప్పారు. రిటైర్డ్ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను పార్టీలోకి ఆహ్వానిస్తానని ఆయన చెప్పారు.  తమిళనాడులో రెండు బలమైన పార్టీలను ఢీకొట్టబోతున్నట్టుగా రజనీకాంత్ తేల్చి చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios