సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటి వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు. గురువారం రజినీకాంత్ తాను స్థాపించబోయే నూతన పార్టీ పేరు ప్రకటిస్తారంటూ నిన్నటి నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... అభిమానులంతా ఆయన నివాసానికి చేరుకున్నారు.

Also Read రజినీకాంత్ సంచలన నిర్ణయం.. రేపే పార్టీ ప్రకటన?...

ఈరోజు రజినీ కాంత్... రజనీ మక్కళ్ మండ్రం జిల్లా కార్యదర్శులతో సమావేశం కానున్నారు. ఇటీవలే ఒకసారి సమావేశం కాగా... ఇప్పుడు మరోసారి సమావేశానికి ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా ఈ వార్త ఆసక్తి రేపింది. ఆయన పార్టీ పేరు ప్రకటించే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ ఏర్పాటు చేశారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో... అభిమానులు వేలసంఖ్యలో ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. రజినీకాంత్ చిత్రపటంతో టీషర్ట్ లు ప్రింట్ చేయించుకొని కొందరు అభిమానులు వాటిని ధరించారు. కొందరు ఆయన ఫోటోతో జెండాలు తయారు చేసి వాటిని పట్టుకొని తిరుగుతున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

కాగా... ఈ మీటింగ్ ముగిసిన వెంటనే రజినీకాంత్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. కాగా... ఏప్రిల్ 14వ తేదీన రజినీకాంత్ తన పార్టీ పేరు ప్రకటిస్తారంటూ ఆయన సన్నిహిత మిత్రుడు తమిళరువి మణియన్ గతంలోనే ప్రకటించారు. మరి ఈరోజు ఆయన పార్టీ పేరు ప్రకటిస్తారో లేదో చూడాలి.