Asianet News TeluguAsianet News Telugu

అమ్మలో నేను ఎప్పుడూ ఆ త్రిమూర్తిని అనుభూతి చెందాను - ప్రధాని మోడీ భావోద్వేగ ట్వీట్

అమ్మలో తాను ఎప్పుడూ ఆ త్రిమూర్తిని అనుభూతి చెందానని ప్రధాని మోడీ తెలిపారు. ప్రధాని తల్లి హీరాబెన్ మోడీ శుక్రవారం తెల్లవారుజామున తుద్విశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయన ఉదయం ఈ భావోద్వేగ ట్వీట్ చేశారు. 

I have always felt that trinity in Amma - PM Modi's emotional tweet
Author
First Published Dec 30, 2022, 8:39 AM IST

ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ తన 99 ఏళ్ల వయసులో శుక్రవారం తెల్లవారుజామున మరణించారు. అనారోగ్యంతో బుధవారం హాస్పిటల్ లో చేరిన ఆమె.. పరిస్థితి విషమించడంతో నేడు తుది శ్వాస విడిచారు. మరణించిన తన తల్లికి ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగ నివాళి అర్పించారు. ‘‘ ఒక అద్భుతమైన శతాబ్ది భగవంతుని పాదాల వద్ద ఉంది.. మా (అమ్మ)లో నేను ఎప్పుడూ ఆ త్రిమూర్తిని అనుభూతి చెందాను. ఒక సన్యాసి ప్రయాణం, నిస్వార్థ కర్మయోగి చిహ్నం, విలువలకు కట్టుబడి ఉండే జీవితాన్ని ఆమె కలిగి ఉందని నేను ఎప్పుడూ భావించాను.’’ అని ఆయన ఈ ఉదయం ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ తో పాటు ప్రధాని మోడీ ఇటీవల ఆయన అహ్మదాబాద్ వెళ్లినప్పుడు తీసిని తన తల్లి ఫోటోను కూడా షేర్ చేశారు. హీరాబెన్ మోడీ మంగళవారం రాత్రి అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆమెను బుధవారం అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఆమె అక్కడ చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె కోలుకుంటోందని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతుందని గుజరాత్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. కానీ పరస్థితి విషమించడంతో నేటి తెల్లవారుజామున 3.30 గంటలకు మరణించిందని హాస్పిటల్ ప్రకటించింది.

నెల వ్యవధిలో మూడుసార్లు.. ఈ సారి 'నిధుల దుర్వినియోగం' ఆరోపణలపై టీఎంసీ అధికార ప్రతినిధి అరెస్టు..

ఆమె పార్థివదేహాన్ని గాంధీనగర్‌కు తరలించనున్నారు. కాగా.. హీరాబెన్ గాంధీనగర్ సమీపంలోని రైసన్ గ్రామంలో ప్రధాని తమ్ముడు పంకజ్ మోడీతో కలిసి నివసించేవారు. ప్రధాని మోదీ తన గుజరాత్ పర్యటనకు వెళ్లినప్పుడు తరచుగా ఆమెను కలిసేవారు. ఆమెతో సమయం గడిపేవారు. అయితే నేడు ప్రధాని కొన్ని అధికారిక కార్యక్రమాలకు హాజరవ్వాల్సి ఉంది. అయితే షెడ్యూల్ ప్రకారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios